ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో కుప్ప కూలిన స్టేజ్, పలువురికి తీవ్ర గాయాలు

Pandal Collapse: ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో స్టేజ్ కూలిన ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Continues below advertisement

 Pandal Collapse in Delhi: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి స్టేజ్ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లని సమీపంలోని సఫ్దర్‌గంజ్‌లోని AIIMS హాస్పిటల్‌కి తరలించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌ సిబ్బంది రంగంలోకి దిగింది. రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. కూలిన స్టేజ్ కింద మరి కొంత మంది చిక్కుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Continues below advertisement

"ఉదయం 11 గంటల సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఓ పెళ్లి ఫంక్షన్‌ కోసం స్టేజ్ కడుతున్నారు. ఉన్నట్టుండి అది కూలిపోయింది. గేట్‌ 2 వద్ద ఈ ప్రమాదం జరిగింది. 8 మంది గాయపడ్డారు. ఈ స్టేజ్ కింద కనీసం 10-12 మంది చిక్కుకుపోయారు. వాళ్లను బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాం. ఇప్పటి వరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. పోలీస్‌లు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఆంబులెన్స్‌ సిబ్బంది అందుబాటులోకి వచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది"

- ఢిల్లీ పోలీసులు 

 

Continues below advertisement
Sponsored Links by Taboola