Japan Earthquake | పాన్‌లో బుధవారం భారీ భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా కేంద్రంగా భూకంపం ఏర్పడినట్లు సమాచారం. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.3 మెగ్నిట్యూడ్‌గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో సుమారు 60 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం ఏర్పడినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. తదుపరి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. 


జపాన్‌లో సరిగ్గా ఇదే నెల.. 2011 మార్చి 11న కూడా భారీ భూకంపం ఏర్పడింది. జపాన్‌కు తూర్పున గల ఓషికాకు 70 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో సముద్ర గర్భంలో 24 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. భూకంపం ఏర్పడిన 20 నిమిషాల్లోనే భారీ సునామీ విరుచుకుపడింది. ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేయడానికి కూడా సమయం దొరకలేదు. అలల బీభత్సానికి ఇళ్లు పేక మేడల్లా కూలిపోయాయి. ఫలితంగా ఆ రోజు 15 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అది ప్రపంచంలోనే 4వ భారీ భూకంపం. 


ఇప్పుడు కూడా సముద్రం గర్భంలోనే భూకంపం ఏర్పడింది. దీంతో తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ప్రస్తుతమైతే అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు సమాచారం. భూకంపం వల్ల రెండు మిలియన్ల ఇళ్లకు పవర్ కట్ అయినట్లు  టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ వెల్లడించింది. దీంతో ప్రజలు చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జపాన్ భూకంప తీవ్రతను ఈ కింది వీడియోల్లో చూండండి.