Jammu Kashmir News: 


వారి కండక్ట్‌పై విచారణ అవసరం లేదు: ఎల్‌జీ మనోజ్ సిన్హా


జమ్ము, కశ్మీర్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ వేటు పడ్డ వారిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బిట్టా కరాటే భార్య కూడా ఉన్నారు. ఆమెతో పాటు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కొడుకు సయ్యద్ అబ్దుల్ ముయీద్‌నూ తొలగించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చటం సహా..1990ల్లో కశ్మీరీ పండిట్ల హత్యల్లోనూ వీరి హస్తముందన్న కారణంగా...విధుల నుంచి తీసేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫారూఖ్ అహ్మద్ అలియాస్ బిట్టా కరాటే ఇప్పటికే ఓ తన నేరాన్ని అంగీకరించారు. సతీష్ టిక్కూ అనే ఓ కశ్మీరీ పండిట్‌ను హత్య చేసినట్టు నేరం ఒప్పుకున్నారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదానికి బలి అయిన తొలి వ్యక్తి సతీష్. ఈయన కుటుంబం ఈ ఏడాది మేలో బిట్టా కరాటేకు సంబంధించిన ఓ వీడియోను ప్రభుత్వానికి అందజేశారు. ఈ బిట్టా కరాటే నేరాంగీకారానికి సంబంధించిన ఈ వీడియోను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1990ల్లో ఎంతో మంది కశ్మీరీ పండిట్‌లను బిట్టా హత్య చేశాడని విచారణలో తేలింది. గతంలోనూ జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇప్పటికే దాదాపు 40 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇదే కారణం చూపిస్తూ..విధుల నుంచి తొలగించింది. వారి కండక్ట్‌పై విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా..."ఈ ప్రాంత భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తప్పదు" అని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌లో కీలక పాత్ర పోషించిన బిట్టా కరాటేను 1990 జూన్‌లో అరెస్ట్ చేశారు. హత్యలు, బెదిరింపు నేరాల కింద ఆయనను జైల్లో పెట్టారు. దాదాపు 16 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2006 అక్టోబర్‌లో బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. 2019లో మరోసారి కరాటేను అరెస్ట్ చేశారు. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చుతున్నాడన్న నేరం కింద అరెస్ట్ చేసినట్టుఅప్పట్లో పోలీసులు తెలిపారు. 


Also Read: Har Ghar Tiranga: జాతీయ జెండా పాడైతే ఎలా డిస్పోస్ చేయాలో తెలుసా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి


Also Read: MS Dhoni Har Ghar Tiranga: డీపీ మార్చిన ధోనీ! ట్యాగ్‌ లైన్‌ చదివితే దేశభక్తి ఉప్పొంగుతుంది!