Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి మృతిచెందారు. ఉగ్రవాదులు తనను చంపేసమయంలో అక్కడే ఉన్నారు మంజునాథ్ భార్య, కుమారుడు. తమను కూడా చంపేయమని ఉగ్రవాదులను కోరగా.. మీ ఇద్దర్నీ చంపం ఈ దాడి గురించి మీ ప్రధాని నరేంద్రమోదీకి చెప్పుకోండి అన్నారని చెప్పారు మంజునాథ్ భార్య పల్లవి.
ఉగ్రవాదుల్లో కొందరు సైనికుల యూనిఫాంలో వచ్చారు.. కశ్మీర్ టూర్ కి వచ్చినవారిలో ఎక్కువమంది కొత్తగా పెళ్లైనవారే. వారిలో మగవారినే టార్గెట్ చేసుకుని చంపారు. మహిళలను వదిలేశారని గుర్తుచేసుకున్నారు పల్లవి. హిందువులే లక్ష్యంగా ఉగ్రమూక రెచ్చిపోయారన్నారు. గుర్రంపై పహల్గాంకు చేరుకున్నాం..ఉదయం నుంచి నా కొడుకు ఏమీ తినలేదు తనకోసం ఏమైనా తీసుకొస్తానని చెప్పి వెళ్లారు. కాల్పులశబ్ధం వినిపించగానే సైన్యం కాల్పులు జరిపారు అనుకున్నాం. ఇంతలో అక్కడ వాతావరణం మొత్తం గందరగోళంగా మారిపోయింది. అప్పటికే నా భర్త రక్తపుమడుగులో కనిపించారని ఆ దృశ్యాలు తలుచుకుని వణికిపోయారు పల్లవి. శివమొగ్గకు చెందిన మంజునాథ్ రియల్టర్..పల్లవి బ్యాంక్ మేనేజర్. ఏప్రిల్ 19 న కశ్మీర్ టూర్ కి వెళ్లిన ఈ కుటుంబం ఏప్రిల్ 24న తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇంతలోనే ముష్కరులు రెచ్చిపోయి ప్రాణాలు తీశారు. మంజునాథ్ పల్లవి కుమారుడు ఇంటర్ పరీక్షలలో 98% మార్కులు సాధించాడు. ఆ ఆనందంలోనే కశ్మీర్ ట్రిప్ తీసుకెళ్లారని మంజునాథ్ మామ మాధవ్ మూర్తి మీడియాకు చెప్పారు.
దాడి జరగడం కన్నా ముందు టూర్ గురించి మాట్లాడిన వీడియో
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నా కళ్లముందే నా భర్త మరణించాడు. అసలక్కడ ఏం జరుగుతోందో నాకు అర్థంకాలేదు. షాక్ లో ఉండిపోయాను, ఏడుపురాలేదు, ఏమీ స్పందించలేకపోయాను. కర్ణాటక శివమొగ్గ నుంచి నా భర్త మంజనాథ్, నా కొడుకు అభిజేయతో కలసి ఇక్కడకు వచ్చాం. డ్రైవర్ కూడా మాతో వచ్చాడు. ఉగ్రవాదులు కేవలం హిందువులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని మాకు అర్థమైంది. ప్రతి ఒక్కర్నీ పేర్లు అడిగి మరీ చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ముగ్గురు వ్యక్తులు మమ్మల్ని కాపాడారు. నా భర్తతో పాటూ నన్నుకూడా చంపేయండి అని ఎదురెళ్లాను, నా కొడుకుకూడా తుపాకికి ఎదురొచ్చాడు...నా తండ్రితో పాటూ నన్ను చంపేయండి అని. మిమ్మల్ని చంపము..వెళ్లి ఈ దాడి గురించి మోదీకి చెప్పు అన్నారని మీడియాకు చెప్పారు పల్లవి.
మంజునాథ ఫ్యామిలీ ఫొటో