ITI Limited Recruitment: బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్ (ITI Limited) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌, బీఈ, ఎల్ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడిఎం, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు మార్చి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. చేసుకోవచ్చు.

విభాగాలు: బిజినెస్ డెవలప్‌మెంట్, ఎస్టేట్‌మేనేజ్‌మెంట్‌, సివిల్‌, లీగల్‌, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, లీగల్, నెట్‌వర్క్‌ సెక్యురిటీ, డేటా సెంటర్, ఐటీ, అఫిషియల్ లాంగ్వేజ్.


వివరాలు..


ఖాళీల సంఖ్య:  41 


* గ్రేడ్ VIII పోస్టులు


⏩ అడిషనల్ జనరల్ మేనేజర్‌: 11 పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


➥ బిజినెస్ డెవలప్‌మెంట్: 03 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 01, ఓబీసీ- 01, ఎస్సీ- 01.


➥ ప్రాజెక్టులు: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు: ఎస్టీ- 01.


➥ ఎస్టేట్‌మేనేజ్‌మెంట్‌: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 01.


➥ సివిల్‌: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు: ఓబీసీ- 01.


➥ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్: 04 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 0I, ఓబీసీ- 02, ఎస్సీ- 01.


➥ కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 01.


* గ్రేడ్ VII పోస్టులు


⏩ డిప్యూటీ జనరల్ మేనేజర్‌: 04 పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


➥ సివిల్‌: 03 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 01, ఓబీసీ- 01, ఎస్సీ- 01.


➥ ఎస్టేట్‌మేనేజ్‌మెంట్‌: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 01.


* గ్రేడ్ VI పోస్టులు


⏩ చీఫ్‌ మేనేజర్‌: 12 పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


➥ ఫైనాన్స్: 03 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 01, ఓబీసీ- 01, ఎస్టీ- 01.


➥ ఎస్టేట్‌మేనేజ్‌మెంట్‌: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు: ఓబీసీ- 01.


➥ లీగల్: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు:యూఆర్- 01.


➥ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్: 04 పోస్టులు
పోస్టుల కెటాయాంపు:యూఆర్- 0I, ఓబీసీ- 02, ఎస్సీ- 01.


➥ నెట్‌వర్క్‌ సెక్యురిటీ: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు:యూఆర్- 01.


➥ డేటా సెంటర్: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 01.


➥ ఐటీ: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 01.


* గ్రేడ్ V పోస్టులు


⏩ మేనేజర్‌: 03 పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు.. 


➥ బిజినెస్ డెవలప్‌మెంట్: 02 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 0I, ఓబీసీ- 01.


➥ అఫిషియల్ లాంగ్వేజ్: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 0I.


* గ్రేడ్ IV పోస్టులు


⏩ డిప్యూటీ మేనేజర్‌: 01 పోస్టు


➥ విభాగం-అఫిషియల్ లాంగ్వేజ్: 01 పోస్టు
పోస్టుల కెటాయాంపు:ఓబీసీ- 01.


* గ్రేడ్ II పోస్టులు


⏩ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌: 10 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: యూఆర్- 04, ఓబీసీ- 02, ఎస్సీ- 01, ఎస్టీ- 01, ఈడబ్ల్య్యూఎస్- 02.


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌, బీఈ, ఎల్ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడిఎం, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


➥ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(గ్రేడ్ II )- 28 సంవత్సరాలు 


➥ డిప్యూటీ మేనేజర్‌(గ్రేడ్ lV)- 38 సంవత్సరాలు 


➥ మేనేజర్‌కు(గ్రేడ్ V)- 42 సంవత్సరాలు 


➥ చీఫ్‌ మేనేజర్‌(గ్రేడ్ VI)- 46 సంవత్సరాలు


➥ డిప్యూటీ జనరల్ మేనేజర్‌(గ్రేడ్ Vll):- 50 సంవత్సరాలు


➥ అడిషనల్ జనరల్ మేనేజర్(గ్రేడ్ VIII)- 54 సంవత్సరాలు 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


జీతం: నెలకు అడిషనల్ జనరల్ మేనేజర్‌కు రూ.18,500 - రూ.23,900, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.17,500 - రూ.22,300, చీఫ్‌ మేనేజర్‌కు రూ.16,000 - రూ.20,800, మేనేజర్‌కు రూ.14,500 - రూ.18,700, డిప్యూటీ మేనేర్‌కు రూ.13,000 - రూ.18,250, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు రూ.8,600 - రూ.14,600.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16.03.2025.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..