ISRO’s SSLV-D2 Specialities:


ఎన్నో ప్రత్యేకతలు..


ఇస్రో ప్రయోగించిన SSLV D2 సూపర్ సక్సెస్ అయ్యింది. శ్రీహరికోటలోని సతీషన్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి మొత్తం మూడు శాటిలైట్లను SSLV D2 రాకెట్ ద్వారా ఇస్రో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈసారి రాకెట్ ప్రయోగంలో కొన్ని విశేషాలు న్నాయి. మొదట రాకెట్ గురించి మాట్లాడుకోవాలి. SSLV D2 అనేది GSLV, PSLV రాకెట్స్ తో పోల్చుకుంటే చాలా చిన్నది. SSLV ఫుల్ ఫార్మ్ స్మాల్ శాటిలైట్ లాంఛింగ్ వెహికల్. అంటే చిన్న చిన్న బరువున్న శాటిలైట్స్ కోసమే తయారు చేసిన రాకెట్ ఇది. దీని హైట్ జస్ట్ 34 మీటర్లు మాత్రమే. పీఎస్ఎల్వీ 44 మీటర్లు ఉండేది. పీఎస్ ఎల్వీలో 4 స్టేజ్ లు ఉంటే...చిన్నరాకెట్ SSLV లో మూడు స్టేజ్ లు మాత్రమే ఉంటాయి. పేలోడ్ కెపాసిటీ కూడా 10 నుంచి 500 కిలోల బరువును మాత్రమే తీసుకెళ్లదు. 2022లోనే తొలిసారి SSLV ని ప్రయోగించారు. ఇది అప్డ్ డేటెడ్ వర్షన్ అన్నమాట. సో ఇకపై రెండు మూడు చిన్న చిన్నా శాటిలైట్లు, నానోసైజ్ వి మోసుకెళ్లటానికి SSLV రాకెట్ నే వాడాలని ఇస్రో ప్లాన్ చేస్తుందన్న మాట. 






డీఎస్‌పీ పాట..


ఇంకా ఇవాళ చేసిన ప్రయోగంలో మొత్తం మూడు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. మొదటిది ఇస్రో కు చెందిన EOS 07 శాటిలైట్ దీని వెయిట్ 156 కేజీలు. రెండోది యూఎస్ఏ అంటారిస్ సంస్థకు చెందిన జానుస్ 1 దీని వెయిట్ 11.5 కిలోలు. ఇక మూడోది 8కిలోల 700 గ్రాముల బరువుండే ఆజాదీ  శాట్ 2. ఈ ఆజాదీ శాట్ ను దేశవ్యాప్తంగా ఉన్న 750మంది గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుంటున్న అమ్మాయిలు తయారు చేశారు. స్పేస్ కిడ్జ్ సంస్థ ఇస్రో సహకారంతో ఇలా విద్యార్థులతో శాటిలైట్స్ తయారు చేయిస్తోంది. ఈ అజాదీ శాట్ మీద జీ20 లోగో ను ముద్రించారు. ఎందుకంటే ఈ ఇయర్ మన దేశమే జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తోందని. కాబట్టి NCC మొదలై 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా NCC సాంగ్ ప్లే అవుతూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇంకా ఇందులో స్పెషల్ ఏంటంటే..అమ్మాయిలు ప్రత్యేకించి గ్రామీణనేపథ్యంలో ఉన్న బాలికలను ఇన్ స్పైర్ చేసేలా వారిలో స్పేస్ సైన్స్ గురించి అవగాహన కలిగించేలా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ The Space Song పేరుతో ఓ పాటను కంపోజ్ చేశారు. సో ఈ స్పెషల్ అకేషన్ లో డీఎస్పీ సాంగ్ కూడా అంతే స్పెషల్ గా నిలిచిపోనుంది అన్నమాట.