Is there sexual harassment in the film industry alone :  కేరళ సినీ పరిశ్రమ ఏడేళ్ల కిందట ఓ హీరోయిన్ ను .. హీరో లైంగికంగా వేధించిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితులపై ఓ కమిటీని నియమించింది. హేమ కమిటీ ఇటీవలే అంటే ఏడేళ్ల తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో ఇండస్ట్రీలో మహిళ్లని ఎలా వేధిస్తారో... పలువురు నటీ నటుల్ని అడిగి తెలుసుకున్న అభిప్రాయాల్ని చెప్పారు. ఈ నివేదికపై చాలా మంది భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. బయట వాళ్లు సమర్థిస్తూంటే.. ఇండస్ట్రీ వాళ్లు మాత్రం హర్షించడం లేదు. 


హేమ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తున్న పలువురు నటీమణులు


హేమ  కమిటీ నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీదత్తా దీన్నో జోక్ గా అభివర్ణించారు. చాలా మంది నటులు ఈ నివేదిక విషయంలో పాజిటివ్ గానే ఉన్నా.. ఎక్కడా లేని వేధింపులు ఒక్క ఇండస్ట్రీలోనే ఉన్నట్లుగా చూపిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీ నివేదిక అభూతకల్పలనతో ఉందని పలువురు మాలయాళీ పరిశ్రమకు చెందిన వారే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రంగంపై తప్పుడు అభిప్రాయం ఏర్పరిచేలా ఈ కమిటీ నివేదిక ఉందని .. అంటున్నారు. 


గతంలో మీ టూ నినాదంతో హైలెట్ అయిన ఫిల్మ్ ఇండస్ట్రీ 


కొన్నాళ్ల క్రితం ఇండస్ట్రీలో మహిళా నటులకు వేధింపులు ఎదురవుతున్న అంశం హైలెట్ కావడంతో.. చాలా మంది తమకు ఎదురైన అనుభవాలను మీ టూ అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవన్నీ వైరల్ అయ్యాయి. ఇప్పటికీ చాలా మంది మీ టూ అంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. సినీ పరిశ్రమ అంటే ప్రజలకు డబుల్ అటెన్షన్ ఉంటుంది. చిన్న తార అయినా తనకు వేధింపులు ఎదురయ్యాయంటే పెద్ద ప్రచారం వస్తుంది. ఈ కారణంగా ఈ మీ టూ ఉద్యమానికి వచ్చిన ప్రచారం అంతా ఇంతా కాదు. 


ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలోనే  వేధింపులు ఉంటాయా ? 


అయితే బయట జరుగుతున్న ప్రచారం.. హేమ కమిటీ రిపోర్టుల వంటివి సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఇలాంటి వేదింపులు ఉంటాయన్న అభిప్రాయాన్ని  కల్పిస్తున్నాయన్న అసంతృప్తి ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రతి రంగంలోనూ మహిళలకు వేధింపులు ఉంటాయని అనేక సార్లు రుజువు అయిందని అంటున్నారు . అయితే సినిమాల విషయంలో కాస్త ఎక్కువ ప్రచారం రావడానికి కారణం.. నటీనటులు క్లోజ్ గా నటించాల్సి రావడంతో పాటు.. ప్రజల్లో సినీ నటు వ్యక్తిగత విషయాలపై ప్రజలకు ఉండే ఆసక్తి కారణమని అంచనా వేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారని ఒక్క సినీ రంగాన్నే వేలెత్తి చూపడం కరెక్ట్ కాదని అంటున్నారు. 


జాగ్రత్త  పడుతున్న సినీ పరిశ్రమ


సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు కాస్త ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అది గ్లామర్ ఫీల్డ్ కావడంతో పాటు అవకాశాల పేరుతో కొంత మంది వేధించేవారు ఉంటారు. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. తమ తమ సినిమా యూనిట్లలో అలాంటి వివాదాలు రాకుండా జాగ్ర్తతలు తీసుకుంటున్నారు. కానీ ఫోకస్ మాత్రం ఎక్కువగా ఇండస్ట్రీపైనే ఉంటోంది.