Invitations for Maha Kumbh : ప్రపంచం నలుమూలల ఉండే హిందువులకు కుంభమేళాలో పాల్గొనడం ఓ కల. వచ్చే ఏడాది జనవరిలో ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ముగిసే ఈ మహాకుంభ మేళా ఏర్పాట్లపై యోగి సర్కార్ దృష్టి పెట్టింది. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ,  పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.                    


యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యోగి ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తోంది.  జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఈ  కుంభమేళాను నిర్వహించనున్నారు.  ఇందుకోసం ఏడాది కిందటి నుంచే  యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి.  కుంభమేళా జరిగే ప్రాంతంలో కరెంట్, రోడ్లు, నీరు వంటి మౌలిక సదుపాయాలకు వందల కోట్లు వెచ్చిస్తున్నారు.  ఈ సారి విద్యుత్ సరఫరా విధానాన్ని పూర్తిగా మారుస్తున్నారు. రెప్పపాటున కరెంట్ పోకుండా చూడాలనుకుంటున్నారు.  ఈ మహా కుంభమేళా కోసం   శాశ్వత, తాత్కాలిక  విద్యుత్ ఏర్పాట్లు చేస్తున్నారు.                                                     


జామ్‌నగర్ సంస్థానం వారసుడు అజయ్ జడేజా - రాజ్యం లేకపోయినా రాజే !


ప్రత్యామ్నాయంగా  సౌరశక్తితో నడిచే హైబ్రిడ్ సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ లైట్ల కారణంగా కుంభమేళా ప్రాంతంలో  చీకటి పడినట్లుగా కూడా తెలియదు  కుంభమేళా ప్రాంతంలో 85 తాత్కాలిక విద్యుత్ సబ్ స్టేషన్లు, 85 డీజిల్ జనరేటర్లు, 42 కొత్త ట్రాన్స్‌ ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. మహాకుంభం సందర్భంగా ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులు, భక్తుల సౌలభ్యం కోసం ప్రయాగరాజ్ ఎయిర్‌పోర్ట్‌ను  వాడుకలోకి తెస్తున్నారు.  మహాకుంభం సందర్భంగా వచ్చే ప్రయాణికుల కోసం 274.38 కోట్ల రూపాయలతో ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేపడుతున్నట్లు ... ఇందులో దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. పర్యాటక శాఖ ‘‘డిజిటల్ కుంభ్ మ్యూజియం’’ నిర్మాణాన్ని చేపట్టారు.                                                             


యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!


దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా హిందువులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. యూపీ ప్రభుత్వం కూడా 34 దేశాలకు చెందిన రాయబారులకు ప్రత్యేకమైన ఆహ్వానాలు పంపింది. మహాకుంభమేళాలో ఎక్కువగా సాధువులు పాల్గొంటారు. వారికి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కుంభమేళాను ప్రపంచం దృష్టి ఆకర్షించేలా నిర్వహించేందుకు యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.