Internship In Mumbai: ఏదైనా కంపెనీలో ఇంటర్నీగా చేరినా..ఎంతో కొంత జీతం ఇస్తారు. ముంబైలో ఓ కంపెనీ కూడా అలాగే ఇస్తోంది. ఎంతో కొంత అంటే ఆ కంపెనీ లెక్కల ప్రకారం కేవలం పది రూపాయలు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.
ముంబైకి చెందిన Faclon Labs అనే కంపెనీ 2025 మే 21న సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. అది ఇంటర్న్‌షిప్ లిస్టింగ్‌కు సంబంధించింది. Faclon Labs నెలకు రూ. 10 స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తున్నట్లు కనిపించింది. ఈ పోస్ట్ వైరల్ అయింది. Faclon Labs ఒక టెక్ స్టార్టప్, ఇది బ్యాకెండ్ డెవలపర్ ఇంటర్న్‌ల కోసం అవకాశాలను అందిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి పూర్తి స్థాయి ఉద్యోగ అవకాశాలను కూడా అందిస్తుంది.
ఈ పోస్టుపై సోషల్ మీడియా బ్లాస్ట్ అయిపోయింది. మీమ్స్ పంట పండించారు. పది రూపాయలు అనిచెప్పినా 1900కుపైగా అప్లికేషన్లు రావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
కానీ చివరికి Faclon Labs ని రూ. 10 స్టైపెండ్ ఒక బాట్ ఎర్రర్ వల్ల జరిగిన పొరపాటు అని ప్రకటించింది. వాస్తవానికి, కంపెనీ ఈ ఇంటర్న్‌షిప్ కోసం నెలకు రూ. 10,000 స్టైపెండ్ ఆఫర్ చేస్తోంది. ఈ సమాచారాన్ని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మనోజ్ కుమార్ అనే వ్యక్తి లింక్డ్‌ఇన్ పోస్ట్ ద్వారా ధృవీకరించారు.
ఆ పోస్టు ఖచ్చితంగా పొరపాటు అయి ఉంటుందని చాలా మంది అనుకున్నారు. ఎందుకుంటే పది రూపాయల జీతంగా ఏ కంపెనీ నిర్దారించదు. సర్కాస్టిక్ గా కూడా ఆ పని చేయదు. ముంబై లాంటి ప్రాంతాల్లో అయితే ఇంటర్నీలకు కూడా కనీసం పదివేలు ఇస్తూంటారు. అలాంటి ఆఫర్లు ఉంటాయి. అయితే విచిత్రగా పది రూపాయల జీతం అని పెట్టినా సరే దాదాపుగా రెండు వేల వరకూ అప్లికే,షన్లు రావడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. వారు కూడా అది పదివేలు అయి ఉంటుందన్న ఉద్దేశంతో చేిస ఉంటారని అనుకుంటున్నారు. ఒక వేళ నిజంగా పది రూపాయలు అయినా.. ఇంటర్నీ అంటే నేర్చుకునేందుకు అవకాశం కాబట్టి చేరేవాల్లు ఉంటారని అంటున్నారు.