భారత్‌లో ఒక నగరం నుంచి మరొక నగరానికి ప్రయాణించడం అంటే చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. కానీ కాలం మారుతున్న కొద్ది ఎంత దూరం ప్రయాణమైనా సరే చాలా సునాయాసంగా సాగిపోతోంది. ఇందులో ప్రయాణికుల ఆకాంక్షలను ముందుగానే గుర్తించి వారికి సరిపడే విధంగా సౌకర్యాలు కల్పిస్తూ ప్రయాణికుల మన్ననలు అందుకుంటుంది రైల్‌యాత్రి. తన ఇంటర్‌సిటీ నెట్‌వర్క్ ద్వారా దేశీయ ప్రయాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. టెక్నాలజీని జోడించి, సౌకర్యాన్ని యాడ్ చేసి అంతర్ నగర ప్రయాణాన్ని ఒక బ్రాండ్‌గా మార్చిన ఈ సంస్థ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. 

Continues below advertisement

రైల్వే సమాచారం నుంచి స్మార్ట్ బస్‌ల వరకు...

ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఇంటర్ సిటీ ప్రస్థానం రైల్ యాత్రితో మొదలైంది. కోట్లాది మంది భారతీయులకు రైలు ప్రయాణ సమాచారాన్ని సులభంగా అందిస్తోంది. అందుకే అతి తక్కువ కాలంలోనే ప్రయాణికుల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఆ పునాదిపైనే ఇప్పుడు ఇంటర్ సిటీ స్మార్ట్ బస్‌ పేరిట రోడ్డు రవాణా రంగంలోకి అడుగుపెట్టింది. కేవలం బస్‌లను నడపడమే కాకుండా, ఒక పద్ధతి ప్రకారం, సరసమైన ధరలకే విలావంతమైన ప్రయాణాన్ని అందించడం దీని ప్రత్యేకత. 

భారీ నెట్‌వర్క్ కోట్ల మంది యూజర్లు 

ప్రస్తుత ఇంటర్‌సిటీ ప్లాట్‌ఫామ్‌ కేవలం ఒక బస్‌ బుకింగ్ యాప్ మాత్రమే కాదు. రైలు సమాచారం, టికెట్ బుకింగ్, రైలులో ఆహారం, స్మార్ట బస్ లేవలను కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. ప్రతి నెల 20 మియలియన్లకుపైగా క్రియాశీల వినియోగదారులు ఈ సేవలను వినియోగంచుకుంటున్నారంటే ఈ సంస్థ ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. 

Continues below advertisement

నేడు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో, 630కిపైగా రూట్లలో ఆరు వందల కంటే ఎక్కువ స్మార్ట్ బస్‌లు నిరంతరం నడుస్తున్నాయి. ప్రతి నెలా దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణికులు  బస్‌లో ప్రయాణిస్తూ తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. 

స్మార్ట్ బస్‌ ఫీచర్లు

ఇంటర్ సిటీ స్మార్ట్ బస్‌లు సాధారణ బస్‌లకు భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణం అందులో ఉండే ఆధునిక సౌకర్యాలు. సుదీర్ఘ ప్రయాణాల్లో ప్రయాణికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య వాష్‌రూమ్‌, దీనిని పరిష్కరిస్తూ బస్‌లోనే పరిశుభ్రమైన వాష్‌రూమ్‌ సౌకర్యాన్ని ఇంట్‌సిటీ కల్పిస్తోంది. ఏకాంతాన్ని కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా ప్రైవేటు క్యాబిన్ సీటింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. క్యూలో నిలబడే పని లేకుండా టెక్నాలజీ సాయంతో వేగంగా డిజిటల్‌ చెక్ ఇన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ప్రయాణికులకు అనుగుణంగా ప్రయాణ తేదీని, రూట్‌ను లేదా బస్‌ను సులభంగా మార్చుకునే వెసులుబాటును ఈ ఫర్స్ అందిస్తుంది