Tips to Identify Fake Milk at Home : ఆంధ్రప్రదేశ్​లోని రాజమండ్రిలో బయటపడిన కల్తీ పాల ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. పాలు తాగాలంటే భయం పట్టుకుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యం కోసం తాగే పాలు నిజంగా సురక్షితమేనా? అనే డౌట్ మొదలైంది. మంచివే అని తాగేస్తున్న పాలల్లో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా? అనే భయంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో పాలు కల్తీ అయితే ఇంటి దగ్గరే కొన్ని చిట్కాలతో వాటిని గుర్తించండి. 

Continues below advertisement

పాలు ఆరోగ్యానికి అవసరం. పాలు కల్తీ అయితే అవి శరీరాన్ని మెల్లగా దెబ్బతీసే ప్రమాదం ఉందని డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం తెలిపారు. అందుకే ల్యాబ్ టెస్ట్​కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అవుతూ కల్తీపాలను గుర్తించవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో.. కల్తీ పాల వల్ల కలిగే నష్టాలు ఏంటో చూసేద్దాం. 

పాలు కల్తీ అయితే కలిగే నష్టాలు.. 

పాలల్లో డిటర్జెంట్, యూరియా, స్టార్చ్, నీరు, సింథటిక్ మిల్క్ కెమికల్స్ వంటివి కలపడమే. అయితే ఇలా కల్తీ అయినా పాలు తాగడం వల్ల పిల్లల్లో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయి. పెద్దల్లో కూడా దీర్ఘకాలంలో లివర్, కిడ్నీ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి రావచ్చు. 

Continues below advertisement

ఇంట్లోనే కల్తీ పాలను ఇలా గుర్తించండి.. 

  • స్నిప్ టెస్ట్ : ఓ చుక్క పాలను నూనె మీద వేయాలి. అది తెల్లటి గీతలా జారితే అది స్వచ్ఛమైన పాలు. నీళల్లా జారిపోతే కల్తీ. 
  • నురగ పరీక్ష: ఓ సీసాలో పాలు వేసి గట్టిగా ఊపండి. అప్పుడు సర్ఫ్​లాగా పైన నురుగు పెరిగితే.. అవి కల్తీ పాలని అర్థం. 
  • ఐరిన్ టెస్ట్ : పాలల్లో ఐరిన్ కలిపితే నీలం రంగు మారితే అవి కల్తీ పాలని అర్థమని చెప్పారు డాక్టర్ సుబ్రహ్మణ్యం.

ఇవేకాకుండా మరిన్ని సింపుల్ టెస్ట్​లు కూడా ఉన్నాయి. ఓ గాజు గ్లాసులో పాలు అంచుల మీదుగా వేయండి. గోడల వెంట పాలు జారిపోతే నీరు కలిసినట్టే. గ్లాసుకు అంటుకుంటూ నెమ్మదిగా దిగితే మంచిపాలని అర్థం. 

  • స్టార్చ్ గుర్తింపు కోసం : ముందుగా పాలను కొద్దిగా మరిగించండి. చల్లారాక అయోడిన్ ద్రావణం 1–2 చుక్కలు వేయండి. నీలం రంగు వస్తే స్టార్చ్ కల్తీ ఉంది. రంగు మారకపోతే సేఫ్. మంచివని అర్థం. 
  • డిటర్జెంట్ కోసం : పాలను బాగా ఊపండి. ఎక్కువగా నురుగు వస్తే డిటర్జెంట్ కలిసిన అవకాశం ఉందని తెలుసుకోవాలి.  సాధారణ నురుగే ఉంటే కల్తీ లేదని అర్థం. 
  • సింథటిక్ మిల్క్ : పాలను చేతిపై ఒక చుక్క వేసి రుద్దండి. సబ్బులా నురుగు వస్తే సింథటిక్ మిల్క్. అలాంటిది లేకుంటే పాలు కల్తీ కాలేదని అర్థం. 
  • వాసన టెస్ట్ : పాలను మరిగించేటప్పుడు గమనించండి. రసాయన వాసన, సబ్బు వాసన వస్తే అలర్ట్ కావాలి. 

ఈ చిట్కాలతో కల్తీపాలను సులభంగా ఇంట్లోనే గుర్తించవచ్చు. రోజూ తాగే పాలు ఆరోగ్యాన్ని దీర్ఘకాలం ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటిని ఎంచుకునే విషయంలో రాజీపడకపోవడమే మంచిదని చెప్తున్నారు వైద్యులు.