INS Udaygiri Himgiri Indian Warships Commissioned in Vizag: విశాఖపట్నం: భారత నౌకాదళం తన యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది.  విశాఖపట్నం నుంచి రెండు అత్యాధునిక INS ఉదయగిరి (F35) , INS హిమగిరి (F34)  ఒకేసారి వార్ జర్నీ ప్రారంభించాయి.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ,  నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి  సమక్షంలో డు వేర్వేరు షిప్‌యార్డ్‌ల నుండి ఒకేసారి రెండు ప్రధాన యుద్ధ నౌకలను సముద్రంలోకి పంపారు. ఇలా చేయడం  భారత నౌకాదళ చరిత్రలో ఇదే మొదటిసారి.

ఈ యుద్ధ నౌకల్ని ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నిర్మించారు.   INS ఉదయగిరిని ముంబైలోని మజగాం డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) నిర్మించగా, INS హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) నిర్మించింది. ఈ రెండు నౌకలు 75 శాతం స్వదేశీ భాగాలతో నిర్మితమయ్యాయి.  ఇది మేక్ ఇన్ ఇండియా ,  ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది.

INS ఉదయగిరి నౌకాదళ వార్‌షిప్ డిజైన్ బ్యూరో (WDB) రూపొందించిన 100వ నౌకగా గుర్తింపు పొందింది. ఇది స్వదేశీ రక్షణ రూపకల్పనలో భారత్ సాధించిన పురోగతిని సూచిస్తుంది.  ఈ యుద్ధ నౌకలు 6,700 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఈ నౌకలు కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ (CODOG) ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడుస్తాయి. 5,500 నాటికల్ మైళ్ల రేంజ్‌ను కలిగి ఉంటాయి.  దీర్ఘ శ్రేణి యాంటీ-షిప్ మరియు ల్యాండ్ అటాక్ సామర్థ్యాలు కలిగి ఉన్నాయి.  విమానాలు, డ్రోన్‌లు ,  మిసైల్స్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి. వరుణాస్త్ర టార్పెడోలు ,  RBU-6000 యాంటీ-సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్‌లు,  అండర్‌వాటర్  దాడులను ఆపడం  చేస్తాయి. రెండు హెలికాఫ్టర్లనను కూడా  ఈ యుద్ధ నౌకలు హోస్ట్ చేయగలవు.  

యాంటీ-ఎయిర్, యాంటీ-సర్ఫేస్, మరియు యాంటీ-సబ్‌మెరైన్ యుద్ధాలలో బహుముఖ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. భారతదేశం  సముద్ర ప్రయోజనాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి బ్లూ వాటర్ ఎన్విరాన్‌మెంట్‌లో అంటే ఒడ్డుకు దూరంగా లోతైన సముద్రంలో) సాంప్రదాయ, అసాధారణ దాడులను ఎదర్కొంటాయి.  ఇంటిగ్రేటెడ్ కంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఈ నౌకలను స్వతంత్రంగా లేదా పెద్ద నావికాదళ ఫ్లీట్‌లో భాగంగా వ్యూహాత్మక సౌలభ్యంతో పనిచేయడానికి అనుమతిస్తుంది. విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్‌లో  కమిషనింగ్ కార్యక్రమం వేడుకగా జరిగింది.