Must Visit Ganesh Temples in India : గణేష్ చతుర్థి 2025 (Vinayaka Chavithi 2025) సందర్భంగా చాలామంది భక్తులు వినాయకుడి ఆలయాలకు వెళ్తూ ఉంటారు. విఘ్నాలను తొలగించి శుభాలను అందిస్తాడని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా వినాయక చవితి సమయంలో చాలామంది పవిత్రదేవాలయాలను సందర్శిస్తారు. మీరు కూడా ఈ సందర్భంగా ఇండియాలోని ప్రసిద్ధమైన వినాయకుడి ఆలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ 5 ఆప్షన్లు ఉన్నాయి. వినాయకుడికి ప్రసిద్ధి గాంచిన ఆలయాలు ఏంటి? ఎక్కడున్నాయి? వాటి ప్రాముఖ్యత ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో వినాయకుడివి చాలా ఆలయాలు ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని చాలా పురాణమైవి. పైగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. పురాణాలు, పవిత్రతో నిండిన ఈ ఆలయాలను లక్షలాది మంది భక్తులను దర్శిస్తారు. కోరికలు నెరవేరడంతో పాటు ఆధ్యాత్మిక ఉపశమనం లభిస్తుందని చెప్తారు. మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు.. ప్రసిద్ధమైన టాప్ 5 ఆలయాలు ఏంటో.. వాటి వెనుక ఉన్న కథలు, నిర్మాణ వైభవం ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
శ్రీ సిద్ధివినాయక్ ఆలయం
(Image Source: x/ SVTMumbai)
భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన గణేష్ దేవాలయాలలో ముంబైలోని శ్రీ సిద్ధివినాయక్ ఆలయాన్ని ఒకటిగా పరిగణిస్తారు. ఈ టెంపుల్‌కు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ నల్లటి బండరాయితో చెక్కిన రెండున్నర అడుగుల ఎత్తైన శ్రీ సిద్ధివినాయకుడు ఉంటాడు. ఒకే రాయితో రూపొదిద్దుకొన్న ఈ విగ్రహాన్ని అందంగా అలంకరిస్తారు. గర్భగుడిలో విగ్రహంతో ఉంటుంది. అంతేకాకుండా లోపలి భాగం అంతా బంగారం, వెండితో పొదగబడి.. చూసేందుకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
గణేష్ టాక్ ఆలయం
(Image Source: x/ Fundotravelclub)
6,500 అడుగుల ఎత్తులో ఉన్న గ్యాంగ్‌టక్‌లోని గణేష్ టాక్ ఆలయం.. అద్భుతమైన వీక్షణలతో భక్తులను ఆకట్టుకుంటుంది. ఎత్తైన శిఖరాలపై ఉన్న ఈ టెంపుల్‌ను భక్తులు ఎక్కువగా విజిట్ చేస్తారు. ఆలయం నుంచి ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి. భక్తులకు ప్రశాంతమైన వాతావరణం అందుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పర్యాటకుల రద్దీ ఉంటుంది. కాబట్టి దానిని బట్టి మీ విజిట్ ప్లాన్ చేసుకుంటే.. ఆలయంతో పాటు ప్రశాంతమైన పరిసరాలను ఆస్వాదించగలుగుతారు.
కనిపాకం వినాయక ఆలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో అద్భుతమైన కనిపాకం వినాయక ఆలయం ఉంది. ఇది సహజంగా ఉద్భవించిన ఆలయం. ఎల్లప్పుడూ నీటిలో మునిగి ఉన్న గణేషుడు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు. నీటి బావిలో మునిగి ఉన్న విగ్రహం శతాబ్దాలుగా కోతను తట్టుకుని నిలబడింది. ఈ విషయం శాస్త్రవేత్తలను, పర్యాటకులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ ఫిబ్రవరి-మార్చి నెలల్లో పెద్ద బ్రహ్మోత్సవం జరుపుతారు.
మనకుళ వినాయగర్ ఆలయం
(Image Source: x/ Namami_Bharatam)
పాండిచ్చేరిలోని మనకుళ వినాయగర్ ఆలయం చరిత్ర, సంస్కృతితో ముడిపడి ఉంది. ఇక్కడ గొప్పగా అలంకరించిన వినాయకుడి కాంస్య విగ్రహం చూడటానికి కళ్లు రెండు సరిపోవు. డిసెంబర్-జనవరి బ్రహ్మోత్సవం సమయంలో స్వామి మరింత వైబ్రేట్‌గా కనిపిస్తారు. ఈ సమయంలో ఆలయాన్ని బాగా అలంకరించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు.
మధుర్ మహా గణపతి ఆలయం
(Image Source: x/ desiredelayer)
కేరళలో ఉన్న మధుర్ మహా గణపతి ఆలయం వెయ్యేళ్ల నాటి ప్రాముఖ్యతను కలిగి ఉంది. పురాణ మధురాష్టకం శ్లోకంతో ఇది ముడిపడి ఉంది. శతాబ్దాల నాటి ఆలయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ టెంపుల్ని కూడా చాలామంది చూసేందుకు వెళ్తూ ఉంటారు.
మీరు కూడా వినాయక చవితి సమయంలో లోకల్‌వే కాకుండా వేరేవి చూడాలనుకుంటే ఈ ఆలయాలను హ్యాపీగా విజిట్ చేయవచ్చు. కుటుంబంతో లేదా ఫ్రెండ్స్‌తో వెళ్లగలిగేందుకు బెస్ట్ ప్లేస్‌లు ఇవి.