Bengaluru infrastructure political Dispute: బెంగళూరులో రోడ్ల దుస్థితి, చెత్త నిర్వహణ విషయంలో  పారిశ్రామిక వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. గతంలో బ్లాక్ బక్ సీఈవో చేసిన ట్వీట్ పై మంత్రులు గట్టిగా స్పందించారు. తాజాగా  బయోకాన్ సంస్థ స్థాపకురాలు కిరణ్ మజుందార్-షా  చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఒక విదేశీ వ్యాపారవేత్త బెంగళూరు సందర్శన సమయంలో నగర రోడ్లు, చెత్త సమస్యలను ఎత్తిచూపుతూ, "బెంగళూరు రోడ్లు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయి?" అని ప్రశ్నించారని ఆమె X లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో, బెంగళూరు ఇన్‌ఫ్రా సమస్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కిరణ్ మజుందార్-షా మరిన్ని పోస్టుల్లో, "బెంగళూరుకు ఉత్తమ ప్రతిభ, ఉత్తమ వాతావరణం ఉన్నాయి కానీ అత్యంత దారుణమైన ఇన్‌ఫ్రా ఉంది" అని పేర్కొన్నారు.   గత ప్రభుత్వాలు కూడా ఈ సమస్యలకు బాధ్యత వహించాలని, ప్రస్తుత పరిస్థితి గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లేనని తెలిపారు. 

Continues below advertisement

 డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో జరిగిన ప్రెస్ మీట్‌లో ఈ విమర్శలకు స్పందిస్తూ, "ఐటీ కంపెనీలకు సహాయంగా, మెరుగైన ట్రాఫిక్, మెరుగైన రోడ్ల కోసం మేము ఈస్ట్ బెంగళూరు కార్పొరేషన్‌ను సృష్టించాం" అని తెలిపారు. అంతేకాక, "బెంగళూరును ధ్వంసం చేయడానికి బదులు, దాన్ని నిర్మిద్దాం" అని కిరణ్ మజుందార్-షా  వ్యాఖ్యలకు పరోక్షంగా .. నేరుగా విమర్శలు చేయవద్దన్న సంకేతాలను ఇచ్చారు.  ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు రూ.1,000 కోట్లు మంజూరు చేసిందని,  గుంతలు పూడ్చే పనులు జరుగుతున్నాయని వివరించారు. "నిరంతర విమర్శలు"పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.  

Continues below advertisement

 ఇతర మంత్రులు కూడా స్పందించారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎంబీ పాటిల్ ఇన్‌ఫ్రా పనులను  కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ  కింద చేపట్టాలని సలహా ఇచ్చారు. ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే, బీజేపీ రాష్ట్రాల్లో అలాంటి విమర్శలు చేస్తే జైలుకు వెళ్తారని వ్యాఖ్యానించారు.  రాజకీయ శత్రుత్వాలు, బలం పెరిగేకొద్దీ శత్రువులు పెరుగుతారనే  డికే శివకుమార్ చెప్పుకొచ్చారు.  

 కిరణ్ మజుందార్-షా వ్యాఖ్యలు "బెంగళూరును డిఫేమ్ చేస్తున్నాయి" అని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు "తక్షణ చర్యలు అవసరం" అని పేర్కొంటున్నారు.