IndiGo services have fully returned to normal : భారతదేశంలోని అతిపెద్ద లో-కాస్ట్ ఎయిర్‌లైన్‌గా గుర్తింపు పొందిన ఇండిగో, గత వారం నుంచి ఎదుర్కొన్న పెద్ద ఆపరేషనల్ క్రైసిస్ నుంచి కొంతమేర రికవర్ అవుతోంది. డీజీసీఏ ఆంక్షలు విధించడంతో కొన్ని సర్వీసులను రద్దు చేసింది. ఆపరేట్ చేస్తున్న సర్వీసులన్నీ యధావిధిగా నడుస్తున్నాయని కంపెనీ చెబుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్‌ను వివరణాత్మక రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.
డిసెంబర్ 2 నుంచి ప్రారంభమైన సంక్షోభం రోజు రోజుకు ముదిరిపోయింది. సిబ్బంది కొరత, కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ ప్లానింగ్‌లో జరిగిన లోపాల వల్ల తీవ్రం అయింది. డిసెంబర్ 5న ఒక్కరోజే 1,600కు పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడంతో, ఇండిగో చరిత్రలోనూ, భారత ఏవియేషన్‌లోనూ అతి పెద్ద క్రైసిస్‌గా మారింది. దీనికి కారణాలుగా పైలట్లు, క్యాబిన్ క్రూ షార్టేజ్, టెక్నికల్ ఇష్యూస్‌ను ఎయిర్‌లైన్ పేర్కొంది.
ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుంది. సివిల్ ఏవియేషన్ మంత్రి రమ్మోహన్ నాయుడు, ఇండిగోకు 10 శాతం ఫ్లైట్ సర్వీసులు తగ్గించాలని ఆదేశించారు. ఇతర ఎయిర్‌లైన్స్‌తో కోఆర్డినేషన్ చేయమని ఆదేశించారు. DGCA, ఇండిగో CEOకు షో-కాజ్ నోటీసు జారీ చేసి, 24 గంటల్లో వివరాలు సమర్పించమని ఆదేశించింది. ఇండిగో అధికారుల ప్రకారం, డిసెంబర్ 8 నుంచి మొత్తం 138 డెస్టినేషన్లకు నెట్‌వర్క్ పూర్తిగా రీకనెక్ట్ అయింది. గురువారం 1,950కు పైగా ఫ్లైట్లు ఆపరేట్ చేశారు. 3 లక్షల మంది ప్రయాణికులు సర్వీసులు ఉపయోగించుకున్నారు.
ఆపరేషన్స్ పూర్తిగా స్థిరత్వంలోకి వచ్చాయని OTP టాప్-టియర్ స్టాండర్డ్స్‌కు చేరుకుందని ఇండిగో ప్రకటించుకుంది. రీఫండ్స్ పరంగా, డిసెంబర్ 1-7 మధ్య 5.86 లక్షల PNRలకు రూ. 569 కోట్లు, నవంబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు 9.55 లక్షల PNRలకు రూ. 827 కోట్లు ప్రాసెస్ చేశారు. అదే సమయంలో ఇబ్బంది ప్రయాణికులకు రూ. 10,000 వాల్యూ ట్రావెల్ వౌచర్లు ఆఫర్ చేయాలని నిర్ణయించుకుంది.