Indian Prisoners in Pakistan Jails: 


308 మంది ఇండియన్స్..


పాకిస్థాన్‌ జైళ్లలో ఎంతో వందలాది మంది భారతీయ ఖైదీలు ఏళ్లుగా మగ్గిపోతున్నారు. అక్రమంగా సరిహద్దు దాటి దేశంలోకి వచ్చిన వాళ్లను గుర్తించి అరెస్ట్ చేశారు పాక్ పోలీసులు. ప్రస్తుతం అక్కడి జైళ్లలో 308 మంది భారతీయ ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో 42 మంది సాధారణ పౌరులు కాగా..266 మంది మత్స్యకారులున్నారు. స్వయంగా పాకిస్థాన్‌ ప్రభుత్వం ఈ లెక్కలు వెల్లడించింది. ఇండియన్ హై కమిషన్ ఈ వివరాలు అడగ్గా..షెహబాజ్ ప్రభుత్వం ఈ సమాచారం అందించింది. ఇరు దేశాల మధ్య జరిగిన ఓ ఒప్పందం ప్రకారం ఈ జాబితాను ఇండియాకు అందజేసింది పాకిస్థాన్. ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్‌లో ఈ వివరాలు సబ్మిట్ చేసింది. ఇందుకు బదులుగా ఇండియా కూడా ఓ జాబితా ఇచ్చింది. భారత్‌లోని జైళ్లలో మగ్గుతున్న పాకిస్థాన్ ఖైదీల లిస్ట్‌ని పంపింది. మొత్తం 417 మంది పాక్‌ పౌరులు భారత్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో 343 మంది సాధారణ పౌరులు కాగా...74 మంది మత్స్యకారులున్నారు. 


భారత్ సూచనలు..


అయితే..శిక్ష పూర్తైన వారిని వెంటనే విడుదల చేయాలని భారత్‌ని పాక్ కోరింది. ఇటు ఇండియా కూడా పాక్‌కి కీలక సూచనలు చేసింది. ఇంకా శిక్ష పూర్తి కాకుండా జైళ్లలోనే ఉన్న భారతీయ ఖైదీలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది. ప్రస్తుతానికి పాక్‌లోని జైళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరైన సంరక్షణ లేకపోవడం వల్ల కొందరు ప్రాణాలొదిలారు. ఈ క్రమంలోనే భారత్‌ పాక్‌కి ఈ సూచనలు చేసింది. దీనిపై పాకిస్థాన్ మాత్రం స్పందించలేదు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. బార్డర్ దాటి వచ్చిన వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకుంటోంది పాకిస్థాన్. ఇటు భారత్ కూడా అదే పని చేస్తోంది. ముఖ్యంగా మత్స్యకారులు సరిహద్దులు దాటి వెళ్తుండడం వల్ల వాళ్లను అక్కడి మెరిటైమ్ సెక్యూరిటీ సిబ్బంది అరెస్ట్ చేస్తోంది. 


ద్రవ్యోల్బణం..


పాక్‌లో ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్‌లు క్రియేట్‌ చేస్తోంది. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగి, సామాన్య జనం ఆకలితో అల్లాడుతున్నారు. పాక్‌లో చక్కెర రేటు కూడా ఏ నెలకానెల కొత్త ఎత్తులకు చేరుతోంది. పాకిస్థాన్ రూపాయి ప్రకారం, కిలో పంచదార ధర రూ. 130 నుంచి ఏకంగా రూ. 200కి పెరిగింది. కొన్నాళ్ల క్రితం రూ. 800 పలికిన 20 కిలోల గోధుమ పిండి ప్యాకెట్‌ ఇప్పుడు రూ. 4000కి చేరింది. అంటే, కిలో గోధమ పిండి కూడా రూ. 200కు చేరింది.  పాకిస్థాన్‌ ధనికులు కూడా ఈ రేట్లను చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇవి కొద్ది రోజుల క్రితం ధరలు. ప్రస్తుతం ఇవి ఇంకా పెరిగే ఉంటాయి.  దీనికి తోడు అప్పు పుట్టక నరకం అనుభవిస్తోంది దాయాది దేశం. ఇప్పటికే కోట్ల రూపాయల రుణాలు చెల్లించలే ఇబ్బందులు పడుతోంది. విదేశీ మారక నిల్వలు నిండుకున్నాయి.  


Also Read: Taliban News: అప్ఘనిస్థాన్‌లో బ్యూటీపార్లర్లపై తాలిబన్ల నిషేధం- ఉపాధిపై మహిళల ఆందోళన