Indian Navy Commissions INS Mormugao: 


INS Mormugao


భారత నేవీలోకి మరో శక్తిమంతమైన INS ప్రవేశించింది. P15B స్టెల్త్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ INS Mormugaoను ప్రవేశ పెట్టారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఇండియన్ నేవీలోకి ఇది అందుబాటులోకి వచ్చింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మైరల్ ఆర్ హరి కుమార్, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత నేవీ చరిత్రలో ఇదే మైలు రాయి అని నేవీ చీఫ్ అడ్మైరల్ ఆర్ హరి కుమార్ స్పష్టం చేశారు. పూర్తిగా దేశీయంగా తయారైన ఈ యుద్ధ నౌక..
వార్‌షిప్ డిజైన్, అభివృద్ధి విషయంలో భారత్ ఎంత పురోగతి సాధించిందనటానికి సాక్ష్యం అని అభిప్రాయపడ్డారు. యుద్ధ నౌకలకు ప్రముఖ నగరాల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని వెల్లడించారు. సముద్ర జలాల సంరక్షణలో మరో ముందడుగు వేశామని చెప్పారు. హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న చైనాకు...ఈ యుద్ధ నౌకలు గట్టి బదులు చెబుతాయని నేవీ భావిస్తోంది. 














ప్రత్యేకతలివే...


1. గోవాలోని మోర్ముగావ్ పోర్ట్‌ సిటీకి ఎంతో చరిత్ర ఉంది. అందుకే...ఈ సిటీ పేరునే ఈ యుద్ధ నౌకకు(Mormugao P15B D67) పెట్టారు. గతేడాది డిసెంబర్ 19 నాటికి గోవా పోర్చుగీస్ నుంచి స్వాతంత్ర్యం పొంది 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మొదటి సారి ఈ యుద్ధనౌకను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు. 


2.భారత నేవీకి చెందిన Warship Design Bureau ఈ నౌకను డిజైన్ చేయగా...Mazagon Dock Shipbuilders Ltd సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ నౌకలో అత్యాధునిక సెన్సార్‌లు, రేడార్‌, వెపన్ సిస్టమ్స్ అమర్చారు. వీటి ద్వారా భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను క్షిపణుల ద్వారా నాశనం చేయొచ్చు. ఉపరితలం నుంచి గగనతలానికీ క్షిపణులను ప్రయోగించేందుకు వీలుంటుంది. 


3.163 మీటర్ల పొడవు, 17 మీటర్లు వెడల్పుతో భారీగా కనిపిస్తుందీ నౌక. 7,400 టన్నుల బరువుతో భారత్‌లో తయారైన అతి శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఒకటిగా చోటు సంపాదించుకుంది. ఇందులో పవర్‌ఫుల్ గ్యాస్ టర్బైన్స్‌ కూడా ఉంటాయి. వేగంగా దూసుకుపోయేందుకు ఇవి ఉపయోగపడతాయి. 


4.న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్...ఇలా ఎలాంటి యుద్ధ వాతావరణంలోనైనా...శత్రు దేశంతో తలపడే సామర్థ్యం  INS Mormugao సొంతం. 


Also Read: Gujarat Election Result: బీజేపీని ఓడించి వెన్నుపోటు పొడిచారు, దేశానికి ద్రోహం చేశారు - ఓటర్లపై గుజరాత్ మంత్రి ఆగ్రహం