Indian Man Attacked by Tiger in Thailand : పులితో ఫోటో దిగొచ్చు కానీ ఆడాలనకుంటే మాత్రం వేటాడేస్తదని యంగ్ టైగర్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. సేమ్ ఇదే పరిస్థితి ఓ వ్యక్తికి అనుభవం అయింది. థాయిలాండ్‌లోని ఫూకెట్‌లో ఉన్న టైగర్ కింగ్‌డమ్‌లో ఈ ఘటన జరిగింది, ఇక్కడ పర్యాటకులు పులులతో సెల్ఫీలు తీసుకోవడం, వాటిని ఆహారం ఇవ్వడం, తాకడం వంటివి చేయవచ్చు.
ఒక భారతీయ పర్యాటకుడు పులి పక్కన నడుస్తూ, దాని వీపును తాకుతూ సెల్ఫీ కోసం సిద్ధమయ్యాడు. ట్రైనర్ పులిని కర్రతో నియంత్రిస్తూ ఉన్నాడు. అయితే, హఠాత్తుగా పులి ఆ వ్యక్తిపై దాడి చేసింది, దీనితో అతను కిందపడిపోయాడు. ఈ ఘటన కెమెరాలో రికార్డ్ అయింది. తర్వాత ఏమయిందో తెలియలేదు.. చుట్టుపక్కల ఉన్న వారి కేకేలు మాత్రం వినిపించాయి.
ఈ ఘటన వీడియో వైరల్‌గా మారింది. ఇక్కడ వారు పులులను పెంపుడు జంతువుల్లా ఉంచుతారు. ప్రజలు సెల్ఫీలు తీసుకోవచ్చు, ఆహారం ఇవ్వవచ్చు .కానీ ఓ పులి హఠాత్తుగా తిరగబడింది.
పులి దాడికి గురైన వ్యక్తికి చిన్న గాయాలే అయ్యాయని చెబుతున్నారు. అతని పులి వీపు లేదా బొడ్డును తాకడం వల్ల దానికి కోపం వచ్చిందని చెబుతున్నారు.