Indian High Commissioner:
స్కాట్‌లాండ్‌లో ఘటన..
భారత్ కెనడా మధ్య వివాదం ఈ రెండు దేశాల్లోనే కాకుండా విదేశాల్లోనూ అలజడి సృష్టిస్తోంది. స్కాట్‌లాండ్‌లో ఇండియన్ హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామిని (Vikram Doraiswami) గురుద్వారలోకి రానివ్వకుండా అడ్డుకోవడం సంచలనమైంది. బ్రిటీష్ సిక్కులు కొందరు ఆయనను అడ్డగించారు. "మిమ్మల్ని ఎవరూ ఆహ్వానించలేదు" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. గురుద్వార కమిటీతో సమావేశమయ్యేందుకు విక్రమ్ దొరైస్వామి వచ్చినట్టు సమాచారం. కానీ...కొందరు సిక్కులు ఆయనను అడ్డగించారు. కొద్ది సేపు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆయన రావడంపై గురుద్వార కమిటీ కూడా విచారం వ్యక్తం చేసిందని అక్కడి సిక్కు కార్యకర్తలు కొందరు తేల్చి చెప్పారు. నిజానికి యూకేలో ఏ గురుద్వారలోకి అయినా భారతీయులున్ని రానివ్వడం లేదు. భారత్, బ్రిటన్ మధ్య సత్సంబంధాలే ఉన్నప్పటికీ...ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరవాత బ్రిటన్‌లోని సిక్కుల్లో భారత్‌పై వ్యతిరేకత పెరిగింది. అందుకే ఇండియన్ హై కమిషనర్‌ని గురుద్వారలోకి రానివ్వకుండా ఇలా అడ్డుకున్నారు సిక్కులు. ఇప్పటికే భారత్, కెనడా మధ్య వివాదం ముదురుతోంది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సిక్కులు విక్రమ్ దొరైస్వామిని అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన వెళ్లిపోతుండగా కొందరు సిక్కులు వచ్చి కార్‌ని అడ్డగించారు. ఓ వ్యక్తి వాళ్లకు అడ్డుగా నిలిచాడు. విక్రమ్ దొరైస్వామి కార్ వెళ్లిపోయేంత వరకూ ఎలాంటి ఘర్షణ జరగకుండా చూశాడు. ఆ తరవాత ఆయన కార్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. Sikh Youth UK ఈ వీడియోని పోస్ట్ చేసింది.
"విక్రమ్ దొరైస్వామిని ఎవరూ ఆహ్వానించలేదు. ఆయనే వచ్చారు. అందుకే సిక్కులు వచ్చి ఆయన్ని అడ్డుకున్నారు. కాసేపు ఘర్షణ జరిగింది. బహుశా గురుద్వార కమిటీ కూడా ఆయన ఆహ్వానం లేకుండా రావడంపై అసహనం వ్యక్తం చేసే ఉండొచ్చు. ఇక్కడే కాదు. యూకేలో గురుద్వారాల్లోకి భారతీయుల్ని రానివ్వడం లేదు. భారత్, యూకే తీరుతో ఇప్పటికే విసిగిపోయాం. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరవాత బ్రిటీష్ సిక్కులంతా అప్రమత్తమయ్యారు"
- బ్రిటీష్ సిక్కు యాక్టివిస్ట్
భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు కెనడా ఇప్పటికీ సిద్ధంగానే ఉందని వెల్లడించారు. నిజ్జర్ హత్య విషయంలో తాము భారత్‌పై చేసిన ఆరోపణలు చేసినప్పటికీ ద్వైపాక్షిక బంధం విషయానికొచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎలాంటి ప్రభావం చూపిస్తోందో గమనిస్తున్నామన్న ట్రూడో...భారత్‌తో మైత్రి కొనసాగించడం తమకు ఎంతో ముఖ్యమని తేల్చి చెప్పారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన...ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: మేమేం తలుపులు మూసేసి కూర్చోలేదు, ఆధారాలుంటే చూపించండి - కెనడాకి జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్