Indian couple faces internet ugly side over groom skin colour: ప్రేమకు రంగు, కుల, మతాలు ఉండవు. కానీ అది ఫీల్ అయిన వారికే తెలుస్తుంది. సోషల్ మీడియాలో అలాంటి ప్రేమ గురించి తెలియని వారే ఎక్కువగా ఉంటారు.
11 సంవత్సరాల ప్రేమించుకున్న తర్వాత మధ్యప్రదేశ్ యువతీ యువకులు రిషభ్ రాజ్‌పుత్, షోనాలి చౌక్సీ పెళలి చేుకున్నారు. వారి సంతోషకరమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి కారణం రిషబ్ నల్లగా ఉండటమే. వారి ఫోటోలతో ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. దీనికి రిషభ్ ఈ ట్రోల్స్‌కు ధైర్యవంతమైన కౌంటర్ ఇచ్చారు. నేను గవర్నమెంట్ ఉద్యోగి కాదు కానీ.. హ్యాండ్సమ్ ఇన్‌కమ్ ఉంది అని ..తనపై కామెంట్ చేస్తున్న వారందరూ పనికి మాలిన వాళ్లు అని తేల్చారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన రిషభ్ రాజ్‌పుత్, షోనాలి చౌక్సీ కాలేజ్ రోజుల్లోనే ప్రేమించుకున్నారు. 11 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నారు. రిషభ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసిన పోస్ట్ ప్రకారం ఈ మూహూర్తానికి 11 ఏళ్లు ఎదురుచూశాను. షోనాలిని కలిసినప్పుడు కళ్లలో కన్నీళ్లు వచ్చాయని చెప్పుకున్నారు. పెళ్లి వీడియోలు, ఫోటోలు సంప్రదాయంగE ఉన్నాయి. పెళ్లికొడుకు రిషభ్ షెర్వానీలో బ్రైట్ పింక్ షాల్, తలపాగా ధరించి, బ్రైడ్ షోనాలి వైబ్రెంట్ మెజెంటా లెహంగాలో మెరిసారు. వైట్-పింక్ రోజాల మాలలు బదులుతూ సంతోషంగా చిరునవ్వులు చిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కానీ వాటిపై ట్రోల్స్ చేశారు. ట్రోల్స్‌కు రిషభ్, Xలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. తనకు హ్యాండ్సమ్ ఇన్‌కమ్ ఉంది కానీ, షోనాలి నాకు ఏమీ లేకప్పుడు ప్రేమించింది. కాలేజ్ డేస్ నుంచి పోర్ట్‌గా ఉంది.. మీ అభిప్రాయం అసలు మ్యాటర్ కాదు తేల్చేశారు.
రిషభ్ మరోవైపు, తన చర్మరంగు మీద ఎదుర్కొన్న వివక్ష గురించి కూడా ప్రస్తావించారు. తాను బ్లాక్ అనే వాస్తవాన్ని అంగీకరిస్తాను కానీ మీకు కూడా అలాంటి ప్రేమ వస్తే మంచిదని సూచించారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, లక్షలాది మంది సపోర్ట్ చూపారు. రిషభ్ పోస్ట్ తర్వాత, సోషల్ మీడియాలో సపోర్ట్ వేవ్ మొదలైంది. నల్లగా ఉంటే బాగా లేనట్లు.. తెల్లగా ఉంటే అందంగా ఉన్నట్లుగా భావించే మనస్థత్వం వల్లనే సమస్యలు వస్తున్నాయని భావిస్తున్నారు.