Indian billionaire Prasanna Shankar wife : తన భార్య తనను వేధిస్తోందని గత నెలలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇండియన్ బిలియనీర్ ప్రసన్న శంకర్ వ్యవహారం వైరల్ అయింది. అయితే అతని భార్య దవ్య శశిధర్ మాత్రం తనపై వ్యతిరేక ప్రచారం జరుగుతున్నా ఇంత కాలం సైలెంట్ గా ఉన్నారు. తాజాగా ఈ అంశంపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
ప్రసన్న శంకర్ ది సైకో మనస్థత్వమని దివ్య శశిధర్ చెబుతున్నారు. తన స్నేహితులతో శృంగారం చేయమని ఒత్తిడి చేసవాడని.. ఎస్కార్టులతో గడిపేందుకు ప్రాధాన్యం ఇచ్చేవాడని ఆమె ఆరోపించారు. అంతే కాదు అనుమానంతో తన ఇంట్లో కెమెరాలు పెట్టి తనపై నిఘా పెట్టేవాడన్నారు. ఆమె ఈ విషయంలో చాలా డాక్యుమెంట్లు బయట పెట్టారు. కోర్టు రికార్డులు, సందేశాలు, ఇమెయిల్‌లు, ఫోటోలు వంటి ఆధారాలు తన వాదనకు మద్దతుగా ఆమె ఉన్నాయని చెబుతున్నారు.
ప్రసన్న శంకర్ తో తన జీవితం గడిపినంత కాలం అత్యంత దురదృష్టకరమైనదికి దివ్య చెబుతున్నారు. ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్ కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రసన్న శంకర్ పన్నులు ఎగవేసేందుకు తనను , 9 ఏళ్ల కొడుకును ఒక దేశం నుండి మరొక దేశానికి తీసుకెళ్లాడని ఆమె చెప్పింది. ప్రసవం తర్వాత బాధాకరమైన శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసేవాడన్నారు. ఆమె నిరాకరించినప్పుడు బయట ఎస్కార్టులను మాట్లాడుకుంటానని చెప్పిన ఆధారాలను దివ్య బయట పెట్టారు. పలు రకాల ఈ మెయిల్స్ ను ప్రశన్న శంకర్ చూపించారు.
2020లో ప్రసన్న శంకర్ తన కుటుంబాన్ని కాలిఫోర్నియా నుండి వాషింగ్టన్ కు మార్చారు. కాలిఫోర్నియాలో పన్నులను తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా చేశారు. అదే సమయంలో దివ్య శశిధర్ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. శృంగారం కోసం పదే పదే వేధించేవాడని తన పని సమయంలో కూడా డిస్ట్రబ్ చేసేవాడని దివ్య తెలిపారు. ఒప్పుకోకపోతే వేరే మహిళల్ని చూసుకుంటానని బెదిరించే వాడన్నారు.
తర్వాత ప్రసన్న శంకర్ తన కుటుంబాన్ని సింగపూర్ కు తరలించారు. అలా వెళ్లడం భార్య దివ్యకు ఇష్టం లేదు. కానీ తన సంపదను పన్నుల నుండి కాపాడుకునేందుకు ఇలా చేశాడు. సింగపూర్‌లో ఉండగా దివ్య శశిధర్‌ను మైక్రోసాఫ్ట్ ఉద్యోగం నుండి తొలగించింది. ఆ తర్వతా ఇద్దరి మధ్య పరిస్థితులు దిగజారాయి. వేశ్యలతో సహా అనేక మంది వ్యక్తులతో లైంగిక సంబంధాలతో ప్రసన్న శంకర్ పాల్గొనేవాడని దివ్య చెప్పారు. శంకర్ తన స్నేహితులతో సెక్స్‌లో పాల్గొనమని ప్రోత్సహిస్తాడని శశిధర్ చెప్పారు. దీనికి తాను నిరాకరించానని చెప్పారు.
అటు ప్రసన్న శంకర్, ఇటు దివ్య శశిథర్ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నాయి. వీటిలో ఎంత నిజం ఉందో కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి.