CDS Bipin Rawat Chopper Crash: నేడు ఢిల్లీకి రావత్ దంపతుల భౌతిక కాయాలు.. శుక్రవారం అంత్యక్రియలు

తమిళనాడు ఊటీ సమీపంలో ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ చాపర్‌లో సీడీఎస్ బిపిన్ రావత్ ఉన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

ABP Desam Last Updated: 09 Dec 2021 07:18 AM

Background

తమిళనాడు కూనూర్​లో ఓ ఆర్మీ హెలికాప్టర్​ కుప్పకూలింది. ప్రమాద సమయంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​తో పాటు ఆయన సిబ్బంది, కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.​ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సూలూర్​ వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్​లోని డిఫెన్స్​ సర్వీసెస్​...More

 గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావ‌త్‌, ఆయన సతీమణి మృతదేహాలను గురువారం ఢిల్లీ తీసుకురానున్నారు.  శుక్రవారం  ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అంతిమ నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. అంత్యక్రియల ఊరేగింపు కామరాజ్ మార్గ్ నుండి ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రంలోగా వారి పార్థివ దేహాన్ని సైనిక విమానంలో దేశ రాజధానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.