Indian Army has launched Operation Keller:  ఆపరేషన్ సిందూర్ తో సంచలన విజయాలు సాధించిన భారత ఆర్మీ కొత్తగా ఆపరేషన్ కెల్లెర్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కింద ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదుల్ని చంపేసింది.  జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని షోకల్ కెల్లర్  అనే అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి ఈ ఆపరేషన్ ను సైన్యం ప్రారంభించింది.  ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో  పాటు  లష్కర్-ఎ-తొయిబా (LeT) వంటి సంస్థలు ఆ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి.  వీరందర్నీ నిర్మూలించడానికి భారత సైన్యం రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ చేపట్టిన  సైనిక చర్య ఆపరేషన్ కెల్లెర్.    ఆపరేషన్ కెల్లర్, ఆపరేషన్ సిందూర్ కు కొనసాగింపు అనుకోవచ్చు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) చీఫ్ షాహిద్ కుట్టే ఈ దాడికి కీలక సూత్రధారిగా గుర్తించారు. తొలి దాడిలోనే అతన్ని చంపేశారు.  షోపియాన్ జిల్లా ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.  TRF వంటి సంస్థలు స్థానిక యువతను రిక్రూట్ చేస్తూ, పౌరులు,  భద్రతా బలగాలపై దాడులు చేస్తున్నాయి. ఈ ఆపరేషన్ ఈ ప్రాంతంలో ఉగ్రవాద బెదిరింపును తగ్గించడం శాంతి భద్రతలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆపరేషన్ ద్వారా, భారత భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, మరియు లాజిస్టికల్ మద్దతును ధ్వంసం చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నాయి.  

 జమ్మూ కాశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి , అంతర్జాతీయ ఒత్తిడి నుండి LeTను రక్షించడానికి ఏర్పాటు చేశారు. షాహిద్ కుట్టే హతం కావడం ఈ సంస్థ యొక్క నాయకత్వం మరియు ఆపరేషనల్ సామర్థ్యానికి పెద్ద దెబ్బ. ఇది భవిష్యత్ దాడులను నిరోధించడంలో,  స్థానిక రిక్రూట్‌మెంట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.  షోకల్ కెల్లర్‌లో ఉగ్రవాదుల ఉనికి గురించి ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్  నిర్వహించారు.  

షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ,   హారిస్ నజీర్ ఈ ఆపరేషన్‌లో హతమయ్యారు.  ఇది TRF ,  LeT  సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని అనుకోవచ్చు.  ఆపరేషన్ కెల్లర్ ఇంకా కొనసాగుతోంది, షోకల్ కెల్లర్ ప్రాంతంలో అదనపు ఉగ్రవాద ముప్పున తొలగించడానికి  సైన్యం ఆపరేషన్ నిర్వహిస్తోంది.  ఈ ఆపరేషన్ భారత భద్రతా బలగాల   ఇంటెలిజెన్స్ సామర్థ్యం ,  ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రతిబింబిస్తుంది.