మహేందర్ సింగ్ ధోనీ సతీమణి సాక్షి సింగ్‌కు కోపం వచ్చింది. జార్ఖండ్‌ ప్రభుత్వంపై మండి పడింది. ఏళ్ల తరబడి జార్ఖండ్‌లో విద్యుత్‌ సంక్షోభం ఎందుకుందంటూ ట్విటర్‌ ద్వారా ప్రశ్నించింది. ''ఒక టాక్స్‌ పేయర్‌గా జార్ఖండ్‌ ప్రభుత్వానికి ప్రశ్న వేస్తున్నా. కొన్నేళ్ల నుండి రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఇంతలా ఎందుకుందనేది తెలుసుకోవాలనుకుంటున్నా. ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మా తరపు నుంచి విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా సమస్య ఒక కొలిక్కి రావడం లేదు'' అని ప్రశ్నించింది. సాక్షి ఇలా ట్వీట్ చేసిన కాసేపటికే పెద్ద ఎత్తున రీ ట్వీట్లు చేసారు.  






దేందయ్యా ఇది! నీళ్లు కూడా ఇవ్వలేదన్న హీరోయిన్- టీ తాగుతోన్న వీడియో రిలీజ్!



కొన్నిరోజులుగా జార్ఖండ్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. దీంతో విద్యుత్‌ వినియోగం పెరిగిపోవడం వల్ల లోడ్‌ మార్పు పేరుతో ప్రభుత్వం గంటల తరబడి కోత విధిస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు, విద్యుత్‌ కోతలతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. జార్ఖండ్‌లోని  పలు జిల్లాల్లో  తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ఏప్రిల్‌ 28 నుండి రాంచీ, బకారో, తూర్పు సింగ్‌భూమ్‌, గర్వా, పాలమ్‌, చత్రాల్లో కూడా వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కరెంట్ లేకపోతే అక్కడ ఉండటం నరక ప్రాయమని వణికిపోతున్నారు. 


6 రోజులకే చెడిపోయిన ఓలా స్కూటర్ - గాడిదకు కట్టి ఊరేగించేసిన యజమాని !


జార్ఖండ్ ధోనీ స్వగ్రామం. రాంచీలోనే ధోనీ కుటుంసభ్యులందరూ నివసిస్తూ ఉంటారు. అక్కడ వారికి కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో ధోనీ ఆడుతున్నారు. అయితే సాక్షి సింగ్ మాత్రం రాంచీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పవర్ కట్ సమస్యల వల్ల చిరాకు పుట్టి ఈ ట్వీట్ చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ధోనీ లాంటి కుబేరుల ఇళ్లల్లో కరెంట్ పోయినా..  ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఉంటాయని.. ప్రజలందరి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆమె ఆ ట్వీట్ చేశారని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ట్విట్టర్ వేదికగా జార్ఖండ్ గవర్నమెంట్‌పై సాక్షి సింగ్ భారీ యార్కర్ వేసిందని కొంత మంది సైటైర్లు వేస్తున్నారు.