IMD Weather Report: భారతీయ వాతావరణ కేంద్రం వాతావరణాన్ని అంచనా వేయడంలో చాలా సార్లు విఫలం అవుతుంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ సేకరించిన ఆధారాల ప్రకారం గత  ఏళ్లుగా ఐఎండీ రుతుపవనాల కాలానుగుణాన్ని తప్పుగా అంచనా వేసిందని తెలుస్తోంది. యూఎస్, యూరప్ వంటి దేశాల్లోని వాతావరణ కేంద్రాలు వాతావరణాన్ని సరిగ్గా గుర్తించగల్గుతున్నాయి. కానీ భారతీయ వాతావరణ శాఖ అంచనాలు ఎందుకు తప్పు అవుతున్నాయి. దానికి కారణం ఏమిటి వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


దిల్లీ వాతావరణ శాఖపై మీమ్స్..


ఇటీవల భారత వాతావరణ శాఖ రుతుపవనాల రాకపై  వేసిన అంచనాలు తప్పయ్యాయి. దీనిపై వివాదం కూడా తలెత్తింది. ముఖ్యంగా దిల్లీకి సంబంధించిన వాతావరణ శాఖ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన జోకులు వేస్తున్నారు. అనేక రకాలమ మీమ్స్ క్రియేట్ చేస్తూ.. ఆగమాగం చేశారు. బాగా ఎండ కాసినప్పుడు వర్షం పడుతున్నప్పుడు, బాగా వర్షం పడుతున్నప్పుడు ఎండ కాస్తుందంటూ పంచులు వేస్తున్నారు. అయితే ఇందుకు కారణం వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలే. దిల్లీ వాతావరణ శాఖ వాతావరణం మామూలుగా ఉన్నప్పుడు రెడ్, ఆరెంజ్, ఎల్లో వంటి హెచ్చరికలను జారీ చేసింది. అయితే హెచ్చరికలు జారీ చేసిన చోట ఎమాత్రం వర్షం పడలేదు. ఎలాంటి చినుకులు లేని దగ్గర.. హెచ్చరికలు జారీ చేయడంతో అబాసుపాలైంది. అంతే కాకుండా ఇంకా చాలా సార్లు ఆ శాఖ వేసిన అంచనాలు తప్పయ్యాయి. 


ఎన్నెన్నో కొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయే తప్ప వాటి వల్ల ఎలాంచి ప్రయోజనం లేకుండా పోతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమర్ నాథ్ గుహలో భారీ వర్షం పడడం వంటి సంఘటనలను వాతావరణ శాఖ నిపుణులు ఎదుకు అంచనా వేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న తరుణంలోనూ వాతావరణ శాఖ ఎందుకు కనిపెట్టలేక పోతోందన్న ప్రశ్నలు  ఎదురవుతున్నాయి. మరోవైపు ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మంచి టెక్నాలజీని అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే.. వాతావరణ శాఖ అంచనాలు దాదాపు నిజమవుతున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. చిన్న పాటి వాతావరణ మార్పులు, మోస్తరు వర్షాలను మాత్రం తప్పుగా అంచనా వేసిన సందర్భాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. 


అందుకే మనం సరిగ్గా గుర్తించలేకపోతున్నాం..


వాతావరణాన్ని అంచనా వేయాలంటే ఉపగ్రహ డేటా, డాప్లర్ రాడార్లు, రేడియోసోండెస్, ఉపరితర పరిశీలన కేంద్రాలు, కంప్యూటింగ్ సాధనాలు ప్రాసెసింగ్ సిస్టమ్ లు అవసరం. ఈ సాధనాలు మన దగ్గర ఎక్కువగా లేవు. అంమెరికా, ఐరోపా వంటి దేశాల్లో కంటే మనం చాలా వెనకబడి ఉన్నాం. మన దేశంలో 34 రాడార్లు మాత్రమే ఉన్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. గత ఐదేళ్లలో కేవలం 5 రాడార్లు మాత్రమే పెరిగాయన్నారు. అలాగే యూఎస్ దాదాపు 200, యూరప్ 150 డాప్లర్ రాడార్లతో వరణ సూచనను చేస్తుందని వివరించారు. అందుకే వారితో పోలిస్తే మనం సరిగ్గా అంచనా వేయలేకపోతున్నామన్నారు.