Zoya Begum Khan Delhi Lady Don: జోయా ఖాన్ అంటే ఎవరికీ తెలియదు.. జోయా బేగంఖాన్ అన్నా ఎవరికీ తెలియదు. కానీ లేడీ డాన్ అంటే మాత్రం ఢిల్లీ అంతా తెలుసు. చూడటానికి హీరోయిన్ లా ఉండే ఈమె ట్రాక్ రికార్డు చూస్తే ఎవరికైనా భయం పుట్టాల్సింది. అలాంటి లేడీ డాన్ ను పోలీసులు చాలా కాలంగా పట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఆమె కోటి రూపాయల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులుకు చిక్కారు.
ఢిల్లీకి చెందిన 'లేడీ డాన్' జోయా ఖాన్, సంవత్సరాల తరబడి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. 33 జోయా బేగం ఖాన్ అన్ని రకాల నేరాల్లోనూ ఆరి తేరారు. తాజాగా ఆమె హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు కోటి రూపాయల విలువైన 270 గ్రాముల హెరాయిన్ ఆమె వద్ద స్వాధీనం చేసుకున్నారు. జోయా ఖాన్ గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య. గ్యాంగ్ స్టర్ భార్య లక్షణాలను బాగానే వంటబట్టించుకుంది. ఏ పని చేసినా తన చేతికి మట్టి అంటకుండా చేస్తుంది. అందుకే ఇంత కాలం పోలీసులు ఆమెను పట్టుకోలేకపోయారు. ఆమెపై హత్య, దోపిడీ , ఆయుధ స్మగ్లింగ్‌తో సహా చాలా కేసులు ఉన్నప్పటికీ ఆధారాలను మాత్రం పోలీసులు సేకరించలేకపోయారు.
2017లో గ్యాంగ్ స్టర్ హషీమ్‌తో వివాహం చేసుకున్న జోయా ఆ తర్వాత లేడీ డాన్ గా మారారు. ఆమె భర్త హషీమ్ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అతని కార్యకలాపాల్ని తప్పక కొనసాగించాల్సిన పరిస్థితిలో జైలుకు వెళ్లి సలహాలు తీసుకుని డాన్ గా మారారు. ఆమెకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ ఇనిస్పిరేషన్. జోయా తరచుగా హై-ప్రొఫైల్ ఈవెంట్లకు హాజరవుతూ సోషల్ మీడియాలో విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తారు. లేడీ డాన్ గా ఆమె .. సెలబ్రిటీ స్టేటస్ కోరుకుంటారు. సమాజంలో వీఐపీలకు పార్టీలు ఇస్తారు. లేడీ డాన్ పార్టీ ఇచ్చి పిలిస్తే..ఎంత సెలబ్రిటీ అయినా వచ్చి తీరాల్సిందే.
2024 సెప్టెంబర్‌లో దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-1లో జిమ్ యజమాని నాదిర్ షా ను లేడీ డాన్ హత్య చేయించారని కేసు నమోదు అయింది. ఈమె తల్లిదండ్రులు కూడా తక్కువ వారేమీై కాదు. లేడీ డాన్ తల్లి వ్యభిచార గృహ నిర్వాహకురాలిగా.. మనుషుల అక్రమరవణాదారుగా ఉన్నారు ఆమె తండ్రి డ్రగ్స్ స్మగ్లర్. ఇటీవలి కాలంలో లేడీ డాన్స్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధాలు పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు.