Operation Sindoor: పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచవ్యాప్త సంచలనంగా మారింది. భారత్‌ను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఈ ఆపరేషన్ వివరాలను ఇద్దరు మహిళలే ప్రపంచానికి తెలియజేశారు. భారతీయ మహిళల పసుపుకుంకుమ లాక్కున్న ఉగ్రవాదులను మట్టిలో కలిపేసే ప్రక్రియ ఎలా సాగిందే తెలియజేశారు. గాజుల చేయి గర్జించి పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టించిందిన విధానం అందరి ప్రశంసలు అందుకుంది.
భారతమాత ముద్దు బిడ్డలైన ఇద్దర మహిళా అధికారులు ధైర్య సాహసాలతో సరిహద్దులను కాపాడటమే కాకుండా.. ఆపరేషన్ గురించి ప్రపంచానికి తెలియజేసి దేశ మహిళల శక్తి నిరూపించారు. ఆపరేషన్ సిందూర్ వివరాలు ప్రపంచవ్యాప్తంగా మీడియాకు వివరించాల్సిన బాధ్యతను భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌కు కేంద్రం అప్పగించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా వారితో కలిసి కీలకమైన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్ రక్షణ సేవల్లో మహిళల భాగస్వామ్యం ఎంతలా పెరుగుతుందో ఈ దృశ్యం చెప్పింది.
కల్నల్ సోఫియా ఖురేషి ఎవరు?కల్నల్ సోఫియా ఖురేషి భారత సైన్యంలో నాయకత్వ పటిమకు శక్తికి ఉదాహరణగా నిలిచారు. 2016లో పూణేలో ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18 కార్యక్రమంలో భాగంగా 18 దేశాల మల్టీ నేషనల్ ఆర్మీ డ్రిల్ నిర్వహించారు. ఈ ఎక్సర్‌సైజ్‌లో భారత్ తరపున పాల్గొన్నారు ఖురేేషీ. 35 ఏళ్ల వయసులోనే భారతదేశ టీంను లీడ్ చేసే ఛాన్స్ తీసుకున్నారు. దీంతో ఆమె ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయమయ్యారు. 40 మంది సైనికులతో కూడిన భారత బృందానికి ఆమె నాయకత్వం వహించారు. ఆ ఈవెంట్‌లో యావత్ ప్రపంచంలో ఇలా ఒక దేశ సైనిక దళానికి నాయకత్వం వహిస్తున్న ఏకైక మహిళగా కూడా ఖురేేషీ రికార్డు సృష్టించారు.
కల్నల్ సోఫియా ప్రయాణంగుజరాత్‌కు చెందిన సోఫియా బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఇది ఆమె చదువుల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి,ని తెలియజేస్తోంది. తర్వాత సైనిక శిక్షణలో రాణించి ఉన్నత స్థానానికి ఎదిగిన విధానం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. 1990లో సైన్యంలో చేరారు కల్నల్ సోఫియా ఖురేషి, మూడు దశాబ్దాలకుపైగా భారత సైన్యానికి సేవలు అందిస్తున్నారు. సైన్యంలో మొదట కమ్యూనికేషన్, సమాచార వ్యవస్థకు బాధ్యత వహించే సిగ్నల్ కార్ప్స్ లో పని చేశారు.
2006లో ఆమె UN శాంతి పరిరక్షక మిషన్ కింద కాంగో వెళ్లారు. 6 సంవత్సరాలకుపైగా శాంతి పరిరక్షక మిషన్‌లలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అంతర్జాతీయ మిషన్లకు ఉత్తమ శిక్షణను అందించే శిక్షకురాలిగా కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆమె కుటుంబానికి సైన్యంతో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆమె తాత సైన్యంలో పని చేేశారు. ఆమె భర్త మెకనైజ్డ్ ఇన్‌ఫ్యాంట్రీలో అధికారిగా ఉన్నారు. తరచూ యువతతో మాట్లాడే ఆమె సైన్యం చేరాలని యువతను ప్రోత్సహిస్తుంటారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం గట్టిగానే బదులు చెప్పింది. ఈ ఒక్కటే కాదు 26/11 ముంబై దాడులు, ఇలా పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. తెల్లవారుజామున, భారతదేశం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (PoJK) అంతటా ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. పహల్గామ్‌లో చనిపోయిన వారికి ఘన నివాళిగా ఈ చర్యలకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారు.