BH Number Series Vehicle: రోడ్లపై వెళ్తున్నప్పుడు మీకు వివిధ రకాల నంబర్ ప్లేట్‌లు కనిపిస్తాయి. అయితే కొన్ని వాహనాల నెంబర్ ప్లేట్లు అన్ని వాహనాల కంటే భిన్నంగా ఉంటాయి. కొన్నింటిపై BH అని రాసి ఉంటుంది. BH నంబర్ కలిగిన వాహనాలు ఒకే రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ కనిపిస్తాయి.

Continues below advertisement

అసలు ఈ BH సిరీస్ ఏంటి, ఎవరికి ఇస్తారో ఆలోచించారా.. బీహెచ్ సిరీస్ అనేది కొంచెం ప్రత్యేకమైనదే. కానీ ఈ వెహికల్ నెంబర్ సిరీస్ ఎవరికి లభిస్తుంది. దీనికి నియమాలు ఏమిటి? BH సిరీస్ అంటే ఏమిటి, ఇది ఎవరికి ఇస్తారో చాలా మందికి తెలియదు. దీని కోసం ఏదైనా ప్రత్యేక అర్హతలు నిర్ణయించారా.. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోవచ్చు.

BH సిరీస్ నంబర్ ఎవరికి ఇస్తారు

BH నంబర్ ప్రత్యేక కేటగిరీ వ్యక్తుల కోసం తయారు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతాలు, రక్షణ సేవల ఉద్యోగులు ఉన్నారు. దీనితో పాటు అనేక రాష్ట్రాల్లో శాఖలు కలిగిన ప్రైవేట్ రంగం కూడా ఈ పరిధిలోనే ఉంటుంది. ఇలాంటి ఉద్యోగులను తరచుగా కొన్ని సంవత్సరాలకు ఒకసారి కొత్త రాష్ట్రం, ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. పాత వ్యవస్థలో, ప్రతి రాష్ట్రంలో మళ్లీ కొత్త వాహనం నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడంతో పాటు, పన్ను,  NOC వంటి సమస్యలు ఎదురయ్యేవి. 

Continues below advertisement

BH నంబర్ ఈ సమస్యలకు పరిష్కారం చూపింది. BH నంబర్ కోసం, వ్యక్తి తన సంస్థ చెల్లుబాటు అయ్యే ID లేదా బదిలీకి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాలి. దీని తరువాత, వాహనం BH సిరీస్‌లో నమోదు చేస్తారు. దీని ఫార్మాట్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో 2 అంకెల సంవత్సరం, BH కోడ్, నాలుగు నంబర్లు, రెండు అక్షరాలు నెంబర్ ప్లేటులో ఉంటాయి.

BH సిరీస్ నియమాలు ఏమిటి?

BH నంబర్ సిరీస్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు ఏ రాష్ట్రంలోనైనా మళ్లీ వెహికల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిన అవసరం లేదు. మీరు ఢిల్లీ నుండి హైదరాబాద్ వెళ్లినా లేదా జైపూర్ నుండి బెంగళూరుకు వెళ్లినా, వాహనం ప్రతిచోటా చెల్లుబాటు అవుతుంది. దీనికి ఏ NOC అవసరం లేదు. ప్రతిచోటా ప్రత్యేకంగా పన్నును మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. BH సిరీస్‌లో పన్ను కూడా బ్లాక్‌లలో తీసుకుంటారు. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పన్ను చెల్లించాలి. ఉద్యోగం తరచుగా మారే వ్యక్తులపై ఇది ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. భవిష్యత్తులో మీరు కారును అమ్మాలనుకుంటే, ఈ నంబర్‌ను సాధారణ నంబర్‌గా మార్చుకుని విక్రయించాలి. అందుకు ఏ సమస్యా ఉండదు. 

ఈ నంబర్ ఎవరికి లభించదు?

బీహెచ్ సిరీస్ సౌకర్యం అందరికీ అందుబాటులో ఉండదని గుర్తుంచుకోవాలి. ఒకే రాష్ట్రంలో పనిచేసే, స్వయం ఉపాధి పొందుతున్న లేదా స్థానిక వ్యాపారాలు నడుపుతున్న వ్యక్తులు దీనికి అర్హులు కాదు. BH నంబర్ ప్రత్యేకంగా ఉద్యోగం కారణంగా తరచుగా కొత్త నగరాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లవలసి వచ్చే వారికి ప్రతిసారి వెహికల్ నెంబర్ నమోదు చేసుకోవడం ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. కనుక వారికి మాత్రమే ఈ సౌకర్యాన్ని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖ కల్పిస్తుంది.