Viral Video:
యూపీలో ఘటన..
యూపీలోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి జిమ్‌లో ట్రెడ్‌మిల్ చేస్తుండగా కుప్ప కూలిపోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నోయిడాలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు ఉన్నట్టుండి కుప్ప కూలిపోవడం జిమ్ సిబ్బందిని టెన్షన్ పెట్టింది. కింద పడిపోగానే జిమ్ సిబ్బంది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఏమైందో అని చూశారు. అప్పటికే పల్స్ పోయింది. ఊపిరి ఆగిపోయింది. రోజూలాగే వచ్చి జిమ్ చేసుకుంటున్న యువకుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం షాక్‌కి గురి చేసింది. 10 నిముషాల క్రితమే ఇంటికి కాల్ చేసి తన తల్లితో మాట్లాడినట్టు స్నేహితులు చెబుతున్నారు. జిమ్‌లో పని చేసే ఇద్దరు వ్యక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రెడ్‌మిల్ చేసుకుంటూ పడిపోయాడని వైద్యులకు వివరించారు. పరీక్షించిన వైద్యులు...హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఉంటాడని చెప్పారు. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. జిమ్ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఓ నటుడు ఇలానే జిమ్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కూడా ఇలానే వ్యాయామం చేస్తూ మృతి చెందాడు.