సైకిల్ తొక్కడం వస్తే చాలు.. జ్యూస్ తయారు చేసుకోవచ్చు. పొద్దున్నే లేచి.. జీమ్ లో కేలరీలు కరిగించేందుకు ఎలాంటి కష్టం చేస్తారో.. అలానే ఇక్కడ కూడా.. జ్యూస్ తయారు చేస్తూ.. ఓ వైపు కేలరీలు కరిగించుకోవచ్చు. మరోవైపు.. మీ జ్యూస్ మీరే తయారు చేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఈ దుకాణం సున్నా వ్యర్థాలతో కూడిన జ్యూస్ పాయింట్. 


ఈ సైక్లింగ్ జ్యూస్ పాయింట్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉంది. కస్టమర్లకు జ్యూస్ అందించేందుకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన మార్గాన్ని చూపుతున్నారు. మోహిత్ కేస్వానీ అనే వ్యక్తి తన పండ్ల రసాన్ని తానే తయారు చేసుకునేందుకు సైక్లింగ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అతను సైకిల్ చేస్తున్నప్పుడు, కింద టైర్లు తిరుగుతు.. పైన అమర్చిన దాంట్లో వాటర్ మిలన్ జ్యూస్ తయారవుతుంది. ఈ టెక్నిక్ తో జీరో-వేస్టేజ్ మరియు జ్యూస్ తాగేందుకు వచ్చిన వారు.. కొన్ని కేలరీలు బర్న్ చేసేలా చేస్తుంది.






'ది గ్రీన్ బర్' అనే జ్యూస్ షాప్.. తమ ఇన్ స్టా గ్రామ్ పేజీలు పెట్టింది. జ్యూస్ తయారు చేసుకున్న వ్యక్తికి ధన్యవాదాలు తెలిపింది. ఈ వీడియోకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 3 లక్షల 75 వేల మంది లైక్‌ చేశారు.


Also Read: Vitamin D Deficiency: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? జాగ్రత్త.. ‘విటమిన్-D’ లోపం నరకం చూపిస్తుంది!


Also Read: Ex GirlFriends group: మాజీ ప్రియురాళ్ల నెంబర్లతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన ఘనుడు, ఆ గ్రూప్ పేరేంటంటే...


Also Read: Radhe Shyam Story: సొరంగంలో మాయమైన రైలు.. ఈ రియల్ మిస్టరీని ‘రాధేశ్యామ్’ ఛేదిస్తాడా? ఆ రైలు ఏమైంది?