లక్నో: ఒక్కోసారి ఎంత పెద్ద పెద్ద హోదాలో ఉన్నా వారు చేసే వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకుంటారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంటారు. సమాజంలో మార్పు రావాలని కోరుకోవడం కాదు, ముందు మనం మారాలి. ఆ తరువాత సమాజంలో మార్పు కోసం ప్రయత్నించాలని ఎందరో గొప్పవారు సూచించారు. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగద్గురు రాంభద్రాచార్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆయన భార్యలను ఇంగ్లీషులో వైఫ్ అని పిలవడంపై ఫన్నీగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయన భార్యలను ఆనందాన్ని పంచే ఓ ఆటబొమ్మ అని సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది.

Continues below advertisement

ఆధ్యాత్మికవేత్త రాంభద్రాచార్య మహిళలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడిన వీడియో ఎక్కడిది, ఎప్పటిదో క్లారిటీ లేదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు, అందులోనూ ముఖ్యంగా మహిళలు మండిపడుతున్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి ఓ బిడ్డను భూమి మీదకు తెచ్చేందుకు సిద్ధపడే మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచిస్తున్నారు. 

రాంభద్రాచార్య WIFE నిర్వచనంపై వివాదం

ఆ వైరల్ వీడియోలో ఆధ్యాత్మిక గురువు రాంభద్రాచార్య మాట్లాడుతూ, "వైఫ్ ఎంత ప్రమాదకరం.. వైఫ్ WIFE మొదటి అక్షరం ఏమిటో మీకు తెలుసు. వివాహితులకు బాగా తెలుసు, అందుకే వారినే అడుగుతున్నాను. వైఫ్ మొదటి అక్షరం ఏమిటి ఇంగ్లీషులో..? అవివాహితులు మాట్లాడకూడదు, గొడవ జరుగుతుంది, సాధువులు దీనిపై మాట్లాడకూడదు అన్నారు.

Continues below advertisement

‘మొదటి అక్షరం W- అంటే.. Wonderful, రెండవ అక్షరం I- అంటే instrument, F అంటే For, చివరగా నాల్గవ అక్షరం E అంటే Enjoy." ఆ తర్వాత ఆయన దీని పూర్తి రూపం ఏమిటని అడుగుతూ, 'Wonderful Instrument For Enjoy' అంటే ఆనందాన్ని ఇచ్చే ఓ పరికరం అని, సంతోషాన్నిచ్చే ఆటబొమ్మ అన్నట్లుగా రాంభద్రాచార్య చేసిన 'వైఫ్' నిర్వచనం తీవ్ర విమర్శలకు దారి తీసింది. 

భర్తలో కలిసి యజ్ఞంలో పాల్గొనే భార్య

రాంభద్రాచార్య దీనికి కొనసాగింపుగా హిందూ ధర్మంలో భార్య అర్థాన్ని వివరిస్తూ, భార్య అంటే తన భర్తతో కలిసి యజ్ఞంలో పాల్గొనేది అని చెప్పారు. భార్య మన దగ్గర ఎప్పుడూ హనీమూన్ కోసం ఉండదు. మన దగ్గర చంద్రుడు ఎప్పుడూ తేనెలాగే ఉంటాడు. మన దగ్గర స్త్రీని అనుభవానికి, యోగానికి ఉపయోగిస్తారు" అని చెప్పినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియో ఎడిట్ చేసిందని, ఆయన అలాంటి మాటలు అనలేదని సైతం రాంభద్రాచార్యకు మద్దతు లభిస్తోంది. 

అసలు నిజం ఏంటి..

జగద్గురు రాంభద్రాచార్య భారత మహిళలపై ఈ వ్యాఖ్యలు చేయలేదు. పాశ్చాత్య ప్రపంచం వివాహిత స్త్రీని భార్యగా ఎలా చూస్తుంది, భారత సంస్కృతి భార్యను ఎలా గౌరవిస్తుందో ఆయన వివరించారు. భర్తలో పలు పుణ్యకార్యాలు, గొప్ప పనులలో భారత్ లో భార్యలకు సముచిత స్థానం ఉంటుందంటూ సాంస్కృతిక దృక్పథాలను పోల్చి చెప్పారు. అయితే కొందరు ఆయన మాటలను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి భార్య (మహిళలు)ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. 

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాంభద్రాచార్య

 తన ప్రకటనల కారణంగా రాంభద్రాచార్య తరచుగా వార్తల్లో నిలుస్తారని తెలిసిందే. ఇంతకు ముందు మహిళలపై చేసిన వ్యాఖ్యల కారణంగా పలు సందర్భాల్లో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. రాంభద్రాచార్య గతంలో ముస్లిం మహిళలపై కూడా వ్యాఖ్యలు చేశారు. ఇస్లాంలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని, వారు ఇష్టం ఉన్నా లేకున్నా పదుల సంఖ్యలో పిల్లలను కనవలసి వస్తుందని అన్నారు.