Income Tax Refund | ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన తరువాత తమ నగదు ఎప్పుడు ఖాతాలో జమ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2024-25 కోసం ITR దాఖలు చేసిన వారిలో చాలా మందికి రిటర్న్స్ వారి ఖాతాలో జమ అయ్యాయి.  ఇంకా కొంతమంది పన్ను చెల్లింపుదారులకు వారి ఖాతాలోకి నగదు జమ కాలేద. ITR చెల్లింపు ఆలస్యం కావడానికి కారణం ఏమిటి?

Continues below advertisement

ఆదాయపు పన్ను శాఖ కొన్ని వాపసు క్లెయిమ్‌లను మరింత జాగ్రత్తగా సమీక్షిస్తున్నట్లు తాజాగా తెలిపింది. ఎందుకంటే అవి 'అధిక-విలువ' (Big Amount) లేదా 'రెడ్-ఫ్లాగ్డ్' కెటగిరీలోకి వస్తాయి. ఈ సందర్భాలలో సాధారణంగా కొన్ని మినహాయింపుల కోసం రిక్వెస్టులు ఉంటాయి. వీటిని ఆమోదించే ముందు అదనపు తనిఖీ చేయక తప్పదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం, డిసెంబర్ 2025 నాటికి అన్ని సరైన రిటర్న్స్ విడుదల చేసే అవకాశం ఉంది.

క్లెయిమ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

మీరు ఇప్పటికే మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసి, మీ నగదు కోసం చూస్తున్నారా, ఇప్పుడు మీరు మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (PAN)ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో దాని స్టేటస్ చెక్ చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను ఈ-ఫైలింగ్ పోర్టల్, NSDL-TIN వెబ్‌సైట్ ద్వారా దీన్ని చెక్ చేయడానికి అనుమతిస్తుంది.

Continues below advertisement

ముందుగా మీరు ఆదాయపు పన్ను (Income Tax) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వినియోగదారు ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీరు ఈ-ఫైల్ చేసిన కేటగిరీలో ఆదాయపు పన్ను రిటర్న్ ఎంపికను పొందుతారు. ఇక్కడ View Filed Returnపై క్లిక్ చేయడం ద్వారా, మీరు మీ క్లెయిమ్ స్టేటస్ చూడవచ్చు. రిటర్న్స్ జమ చేయడానికి ముందు, మీ బ్యాంక్ ఖాతా ప్రీ-వాలిడేట్ అయిందని, మీ రిటర్న్ సరిగ్గా దాఖలు చేశారని.. మీ ITR ఇ-వెరిఫై చేశారని నిర్ధారించుకోవడం ముఖ్యం.

ఒక క్లిక్‌తో మొత్తం సమాచారం

NSDL-TIN వెబ్‌సైట్‌లో మీరు మీ ఐటీ రిటర్న్స్ ట్రాక్ చేయవచ్చు. మీ PAN ఎంటర్ చేసి, అసెస్‌మెంట్ సంవత్సరాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అక్కడి పేజీలో రిటర్న్స్ వివరాలు కనిపిస్తాయి. ఇందులో మీకు రిటర్న్స్ జారీ చేశారా లేదా, మొత్తం ఉపయోగించిన పద్ధతి - చెక్ లేదా NEFT కూడా ఉంటాయి. ఇంతలో, ఆదాయపు పన్నుశాఖ పరిశీలన కొనసాగిస్తున్నందున, ట్యాక్స్ పేయర్లు తమ ఐటీఆర్ స్టేటస్ ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసి సమాచారాన్ని పొందవచ్చు. దాంతో మీకు నగదు తిరిగి జమ కావడంపై క్లారిటీ వస్తుంది.