Viral Video:


రాజస్థాన్‌లో భారీ వర్షాలు..


బిపార్‌జాయ్ తుపాను ఎఫెక్ట్‌తో రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా...రాజస్థాన్ మాత్రం వర్షాలతో సతమతం అవుతోంది. అంత భారీ వానలోనూ కొందరు తమ డ్యూటీని మాత్రం మర్చిపోవడం లేదు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను కరెక్ట్ టైమ్‌కి డెలివరీ చేస్తున్నారు. కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఓ ఏజెంట్ వర్షాన్ని, వరదని లెక్క చేయకుండా ఓ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేశాడు. ఈ ఏజెంట్‌ పనిని ఎంతో మెచ్చుకున్నారు హర్‌దీప్ సింగ్. ఉద్యోగంపై ఇంత డెడికేషన్ ఉండటం గొప్ప విషయం అంటూ కితాబునిచ్చారు. రాజస్థాన్‌లోని బర్మేర్‌లో ధోక్ గ్రామంలో ఈ ఏజెంట్ ఇలా వరదలో కష్టపడుతూనే గ్యాస్ డెలివరీ చేశాడు. 


"ప్రతి ఒక్కరికీ ఎల్‌పీజీ అందుబాటులో ఉంటుందని భరోసా ఇస్తున్నాం. డ్యూటీ పట్ల ఎంతో డెడికేషన్ ఉన్న ఈ సైనికుడు బిపార్‌జాయ్ తుపాను ప్రభావాన్నీ లెక్క చేయలేదు. ఇండేన్ గ్యాస్‌ని రీఫిల్‌ని సప్లై చేసేందుకు ఇలా సాహసం చేశాడు"


- హర్‌దీప్ సింగ్ పురి, కేంద్రమంత్రి






ఇంటి ముందు వరద పారుతున్నా సరే పట్టించుకోకుండా గ్యాస్ బండను మోసుకుంటూ తీసుకొచ్చాడు ఆ ఏజెంట్. ఇప్పటికే ఈ వీడియోకి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది కామెంట్స్ పెడుతున్నారు. 


" ఈ గ్యాస్ డెలివరీ పని చేసే వాళ్లంతా అండర్‌ రేటెడ్ అని నా అభిప్రాయం. అంత బరువైన సిలిండర్‌ని భుజాన వేసుకుని మెట్లు ఎక్కుతారు. ఎవరి వంటకూ ఇబ్బంది రాకుండా చూస్తారు. వాళ్లకు ఆ శ్రమకు తగ్గ జీతాలు దొరకాలి. డెలివరీకి మంచి వెహికిల్స్‌ని కూడా ఇవ్వాలి"


- ఓ నెటిజన్ కామెంట్