Viral News: పాతాళ లోచ్ చేప.. దీని గురించి చాలా మందికి తెలియదు. 2020లో ఈ చేపను తొలిసారి కేరళలో గుర్తించారు. సంస్కృత పదం పాతాల ఆధారంగా పాతాల ఎల్‌లోచ్ అని పేరు పెట్టారు. పామును పోలి పరిమాణంలో చిన్నగా ఉంటుంది. ఈ జాతి చేపలు భూగర్భ జలాలు ఉండే రాళ్లు, భారీ భూ పొరల్లో ఎక్కువగా ఉంటాయి. భారత్‌లో ఇలాంటివి దాదాపు 20 వరకూ ఉండొచ్చు. ఇందులో 11కు పైగా జాతులు కేరళలో గుర్తించినట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజీవ్ రాఘవన్ తెలిపారు. ఈ చేపలు ప్రత్యేకమైనవని కేవలం భారత్, చైనా, మెక్సికో వంటి ప్రాంతాల్లోనే ఇవి కనిపిస్తాయని రాఘవన్ వివరించారు. భూగర్భ జలాల్లో ఉండే ఈ చేపలు బోర్ల ద్వారా పైకి వచ్చినప్పుడు, వేసవిలో బావులు అడుగంటినప్పుడు మాత్రమే కనిపిస్తాయని చెప్పారు.
1950 వరకూ ఎవరికీ తెలియదటదేశం మొత్తం మీద కేరళలోనే బావులు అధికంగా ఉంటాయి. దాదాపు 70 లక్షలకు పైగా బావులు ఉంటాయి. అందుకే ఈ భూగర్భ చేపల సంఖ్య ఎక్కువగా కేరళలోనే గుర్తించారు. 1950 వరకు వీటి గురించి ఎవరికీ తెలియదని శాస్త్రవేత్తలు తెలిపారు. 2015లో ఒక ప్రాజెక్టుకు సంబంధించి కేరళ ఫిషరీస్ ఓషన్ స్టడీస్ యూనివర్సిటీ అధ్యయనం చేస్తుండగా కేరళలో భూగర్భ జాతుల చేపల గురించి తెలిసింది. దీంతో బావులు, కొళాయిల ద్వారా భూగర్భ చేపలు బయటకు వస్తాయని వర్సిటీ అధికారులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేకమైన, కొత్త రకం చేపలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. అలా దాదాపు 13 జాతులకు చెందిన 150 నమూనాలను వర్సిటీ అధికారులు సేకరించారు.
డైనోసార్ల కాలం నాటి చేప.. కేరళలో లభ్యంఇలా కేరళలో దొరికిన చేపల్లో ఒక దానిపై పరిశోధన, అధ్యయనం చేయగా ఆ చేప దాదాపు 12.5 కోట్ల ఏళ్ల నాటిదని గుర్తించారు. ఆకాలంలో భూమిపై డైనోసార్లు తిరిగేవని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం భూగర్భంలో ఉంటున్న చేపలు కోట్ల ఏళ్లనాటివని చెప్పారు. మూడేళ్ల క్రితం కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన అబ్రహం ఈ చేపలను తొలిసారి గుర్తించారు. స్నానం చేస్తున్నప్పుడు బకెట్‌లో ఎర్రటి దారం ఆకారంలో కదులుతున్న చేపను గుర్తించి దానిని గాజు సీసాలో భద్రపరిచారు. దానిని డాక్టర్ బినోయ్ థామస్ అనే ప్రొఫెసర్ సాయంతో కేరళ ఫిషరీస్ ఓషన్ స్టడీస్ యూనివర్సిటీ పరిశోధకులను కలిశారు. దానిని పలిశీలించిన వారు ఇది కొత్త జాతి చేపగా నిర్ధారించారు. తరువాత అబ్రహంకు చెందిన బావి, నీటి ట్యాంకుల్లో కొన్ని వారాల పాటులో ఇలాంటి జాతి చేపలను వారు గుర్తించారు.
హాలీవుడ్ స్టార్, పర్యావరణ ప్రేమికుడు డికాప్రియో పాతాళ లోచ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పాతాళ లోచ్ చేపను గుర్తించిన అబ్రహంను ప్రత్యేకంగా అభినందించారు. దీనిపై అబ్రహం స్పందిస్తూ డికాప్రియో లాంటి గొప్ప వ్యక్తి తనను అభినందించడం సంతోషంగా ఉందన్నారు. అది తనకు గర్వంగా ఉందన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి Join Us on Telegram: https://t.me/abpdesamofficial