టీవీకే పార్టీ (TVK Vijay) వ్యవస్థాపకుడు, తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకులలో ఒకరు, దళపతి విజయ్ (Thalapathy Vijay) నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత (Vijay Wife Sangeetha) కోర్టును ఆశ్రయించారు. తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చిత్ర పరిశ్రమతో పాటు తమిళ, దేశ రాజకీయాల్లో ఈ వార్త సంచలనమైంది. అసలు, విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఏమిటి? కోర్టుకు తెలిపిన వివరాల్లో ఏముంది? అనేది చూస్తే...

Continues below advertisement

నటితో విజయ్ అక్రమ సంబంధం!దక్షిణాది చిత్రసీమలోని కథానాయిక త్రిషతో విజయ్ (Vijay Trisha Relationship)కు సంబంధం ఉందని తమిళ రాజకీయాల్లో కొందరు బాహాటంగా విమర్శలు చేసి, ఆ తర్వాత వెనక్కి తగ్గారు. క్షమాపణలు చెప్పారు. అయితే... ఇప్పుడు విజయ్ భార్య దాఖలు చేసిన డివోర్స్ పిటీషన్ చూస్తే? విజయ్ - త్రిష బంధంపై పరోక్ష విమర్శలు చేశారని చెప్పవచ్చు.

ఏప్రిల్ 2021లో నటితో విజయ్ అక్రమ / వివాహేతర సంబంధం నడుపుతున్నట్టు తన దృష్టికి వచ్చినట్టు సంగీత విజయ్ తెలిపారు. ఆ తర్వాత తాను తీవ్ర మానసిక వేదనకు గురి అయ్యానని, వివాహ బంధం / నమ్మకంలో తాను మోసపోయానని ఆవిడ వివరించారు. వివాహేతర సంబంధానికి ముగింపు పలుకుతానని తొలుత విజయ్ మాట ఇచ్చినప్పటికీ... దాన్ని కొనసాగిస్తూ తనను మరింత మానసిక వేదనకు గురి చేశారని ఆరోపించారు.

Continues below advertisement

నన్ను దూరం పెట్టి నటితో షికార్లు!సెప్టెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్యలో కౌన్సిల్ ద్వారా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించానని, కానీ సఫలం కాలేదని కోర్టుకు సంగీత విజయ్ వివరించారు. తన నుంచి దూరంగా జరగడంతో పాటు నటితో కలిసి విజయ్ విదేశాలకు వెళ్లారని, షికార్లు చేశారని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి (విజయ్ - త్రిష) ఫోటోలు వైరల్ అవ్వగా, వాళ్ళిద్దరి సంబంధం గురించి కథనాలు రాగా... వాటిని ఖండించకుండా పరోక్ష అంగీకారం తెలపడం వల్ల తనకు, పిల్లలకు ఎంతో అవమానంగా అనిపించిందని సంగీత చెప్పారు. 

Also Readరష్మికతో బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమలో పడలేదు, పెళ్ళీ చేసుకోలేదు... ఇంకా ఒంటరిగా రక్షిత్ శెట్టి?

త్రిష పేరును పిటీషన్‌లో సంగీత ఎక్కడా పేర్కొనలేదు. కానీ ఆవిడకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టును కోరారు. ఆగస్టు 2024 - ఫిబ్రవరి 2025 మధ్య ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదని ఆవిడ తెలిపారు. పైగా, తనకు ఆర్థికపరమైన పరిమితులు విధించడంతో పాటు తన స్వేచ్ఛకు విజయ్ సంకెళ్లు వేశారని సంగీత చెప్పారు. ఈ తరుణంలో విజయ్ తో వైవాహిక సంబంధంలో కొనసాగలేనని, తనకు విడాకులు మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశారు. కెమెరా కనుసన్నలలో విచారణ జరగాలని కోరారు.

Also ReadVishnu Vinyasam Review - 'విష్ణు విన్యాసం' రివ్యూ: శ్రీవిష్ణు సినిమా హిట్టేనా? కామెడీ బావుందా? లేదా?