Vande Bharat Express: 


రంగు మారింది..


వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రంగుని మార్చేసింది రైల్వే శాఖ. అంతకు ముందు ఉన్న బ్లూ కలర్‌ని కాషాయ రంగులోకి మార్చింది. ఇకపై అందుబాటులోకి వచ్చే వందేభారత్ ట్రైన్‌లు ఇదే రంగులో కనిపించనున్నాయి. ఈ కొత్త కాషాయ వందేభారత్ ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ఈ రైళ్లు తయారు చేసే చెన్నైలోని  Integral Coach Factoryలో ఉంది. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీలో 25 రకాల డిజైన్‌లతో వందేభారత్ ట్రైన్‌లు తయారు చేశారు. ఇవన్నీ సర్వీస్‌లు అందిస్తున్నాయి. మరో రెండింటిని రిజర్వ్‌లో ఉంచారు. 28వ వందేభారత్ ట్రైన్‌కి మాత్రం ట్రయల్‌ బేసిస్‌లో ఇలా రంగు మార్చారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ కోచ్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. సేఫ్‌టీ మెజర్స్‌ని పరిశీలించారు. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో చేసిన మార్పులుచేర్పులనూ అడిగి తెలుసుకున్నారు. ఆ తరవాత ఆయన కీలక వివరాలు వెల్లడించారు. దేశ త్రివర్ణ ప్రతాకం నుంచి స్ఫూర్తి పొంది వందేభారత్‌కి కాషాయ రంగు వేసినట్టు చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా వీటిని తయారు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 


"ఇది మేకిన్ ఇండియా కాన్సెప్ట్. అంటే...ఇంజనీర్‌లు, టెక్నీషియన్లు అంతా ఇండియాకు చెందిన వాళ్లే. ఇప్పటికే కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఫీల్డ్ యూనిట్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకుంటున్నాం. ఏసీలు ఎలా పని చేస్తున్నాయి..? టాయిలెట్‌లు శుభ్రంగా ఉంటున్నాయా లేదా అన్న వివరాలు అడుగుతున్నాం. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే వందేభారత్ ట్రైన్‌లలో మార్పులు చేస్తున్నాం. డిజైన్‌లోనూ మార్పులు జరుగుతున్నాయి"


- అశ్వినీ వైష్ణవ్, రైల్వేమంత్రి