ABP  WhatsApp

Basavaraj Bommai on KTR: కేటీఆర్‌కు కర్ణాటక సీఎం కౌంటర్- బాలయ్య డైలాగ్‌తో బొమ్మై ఫైర్

ABP Desam Updated at: 06 Apr 2022 12:55 PM (IST)
Edited By: Murali Krishna

అభివృద్ధిలో బెంగళూరును హైదరాబాద్‌తో కంపేర్ చేయడం హాస్యాస్పదమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. బెంగళూరు నగరం 'అన్‌స్టాపబుల్' అని కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్‌కు కర్ణాటక సీఎం కౌంటర్- బాలయ్య డైలాగ్‌తో బొమ్మై ఫైర్

NEXT PREV

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కౌంటర్ ఇచ్చారు. సిలికాన్ వ్యాలీ(బెంగళూరు)లో అసౌక‌ర్యంగా ఉంటే తెలంగాణకు వచ్చేయాలని పరిశ్రమలను ఆహ్వానించడంపై బొమ్మై వ్యంగ్యంగా స్పందించారు. బెంగళూరుతో హైదరాబాద్‌ను పోలిస్తే నవ్వొస్తుందన్నారు.



ఇలాంటి వ్యాఖ్యలు వింటే నవ్వొస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బెంగళూరు తరలివచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తుంటారు. స్టార్టప్‌లు, యూనికార్న్ సంస్థలు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న నగరం కూడా బెంగళూరే. మూడేళ్లుగా రాష్ట్రం ఎంతో ఆర్థిక ప్రగతి సాధిస్తోంది. బెంగళూరులో బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఈ నగరం అన్‌స్టాపబుల్.                                                                    - బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి


కర్ణాటక ఫైర్






మరోవైపు, కర్ణాటక బీజేపీ కూడా కేటీఆర్ ట్వీట్‌పై స్పందించింది. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలుసని, ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలంటూ ఘాటుగా ట్వీట్ చేసింది.



మన పళ్లెంలో ఈగ పడినా పట్టించుకోని వారు పక్క వారి పళ్లెంలో పడిన ఈగ గురించి మాట్లాడడం సహజం. ఉనికి కోల్పోతున్న కేసీఆర్ సర్కారు అభివృద్ధి విషయంలో బెంగళూరుతో సవాలు చేయడం హాస్యాస్పదం.                                                                   -   కర్ణాటక భాజపా


ఏం జరిగింది?


ప‌రిశ్ర‌మ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ఖాతాబుక్ సీఈఓ ర‌వీష్ న‌రేశ్ చేసిన ఆవేద‌నా భ‌రిత ట్వీట్ కు తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. సిలికాన్ వ్యాలీ(బెంగళూరు)లో అసౌక‌ర్యంగా ఉంటే తెలంగాణకు వచ్చేయాలని ఆహ్వానించారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది.  



బ్యాగ్‌లు సద్దేసి హైదరాబాద్ వచ్చేయండి. అద్భుత‌మైన మౌలిక వ‌స‌తుల‌తో పాటు సామాజికంగానూ మెరుగైన ప‌రిస్థితులు హైదరాబాద్ సొంతం. రాక‌పోక‌ల‌కు ఈజీగా ఉండేలా ప్రపంచస్థాయి ఎయిర్‌పోర్టు కూడా హైద‌రాబాద్‌కు ఉంది. ఇక మా ప్ర‌భుత్వం ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధి అనే మూడు అంశాల ప్రాతిప‌దిక‌గా సాగుతోంది.                                                                           - కేటీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి

Published at: 06 Apr 2022 12:51 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.