UP Assembly New Rules: 65 ఏళ్ల తరువాత యూపీ అసెంబ్లీలో కొత్త రూల్స్

UP Assembly New Rules: 65 ఏళ్ల చరిత్రలో ఉత్తరప్రదేశ్ తొలిసారిగా శాసనసభ సభ్యులకు కఠిన నియమాలను ప్రవేశపెట్టింది.

Continues below advertisement

UP Assembly New Rules: 65 ఏళ్ల చరిత్రలో ఉత్తరప్రదేశ్ తొలిసారిగా శాసనసభ సభ్యులకు కఠిన నియమాలను ప్రవేశపెట్టింది. సభ్యుల ప్రవర్తనపై కఠినమైన మార్గదర్శకాలను రూపొందించడమే కాకుండా, సభ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించే ప్రక్రియను డిజిటలైజేషన్ చేసేలా కొత్త విధానాలను రూపొందించింది. 

Continues below advertisement

గతంలో సభా నుంచే కొంత మంది సభ్యులు నుంచి ఫేస్‌బుక్‌ లైవ్‌ చేసేవారు. ఇలాంటి విషయంలో చాలా సార్లు వివాదం నడిచింది. కొంత మంది బ్యానర్లు, జెండాలు ధరించి ఆందోళనలు చేసేవారు. కొత్త నియమాల మేరకు ఇకపై సభకు ఆయుధాలు, జెండాలు, బ్యానర్లు ధరించి రాకూడదు. అంతేకాదు. గతంలో సభలోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లేవారు. సభ్యుల ప్రవర్తనను వీడియో తీసి వైరల్ చేసేవారు. అయితే కొత్త రూల్స్ ప్రకారం అసెంబ్లీ లోపలికి మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. కొత్త నిబంధనల ప్రకారం సభ్యులు సభలో ఎటువంటి పత్రాన్ని చించివేయడానికి అనుమతించరు.

ఉత్తరప్రదేశ్ శాసనసభ నియామాలు-2023 ఆమోదం పొందితే  1958 నాటి విధివిధానాలు, వ్యాపార ప్రవర్తన నియమాల స్థానంలో కొత్త నియమాలు అమలులోకి వస్తాయి. గతంలో గవర్నర్ అసెంబ్లీకి సమన్లు ​​ఇవ్వడానికి 14 రోజులు ఉన్న గడువు ఇప్పుడు ఏడు రోజులకు కుదించారు. 

అంతేకాకుండా, వార్తాపత్రికలు, గెజిట్‌లు, వైర్లు, సమాచార మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు ఈ నియమాలు వర్తిస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, ప్రశ్నలకు సమాధానాలు సెషన్ ప్రారంభానికి అరగంట ముందు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ప్రశ్న లేవనెత్తిన సభ్యునికి మాత్రమే కాకుండా అందరికీ సులభంగా అందిచబడతాయి.

కొత్త నిబంధనల ప్రకారం, సభ్యులు స్పీకర్ కుర్చీకి వీపు చూపించడానికి లేదా స్పీకర్ సీటు వద్దకు స్వయంగా వెళ్లడానికి అనుమతించబడరు. అలాగే, నిత్యకృత్యంగా మారిన ప్లకార్డులు, బ్యానర్‌ల ప్రదర్శనను అసెంబ్లీ లోపలికి అనుమతించరు. అలాగే సభా కార్యకలాపాలకు సంబంధించిన ఎలాంటి సాహిత్యం, ప్రశ్నలు, పుస్తకాలు పత్రికా ప్రకటనలను సభ్యులు పంపిణీ చేయలేరు.

అంతేకాకుండా, లాబీలో అసెంబ్లీ లోపల వినిపించేంత గట్టిగా మాట్లాడకుండా, నవ్వకుండా సభ్యులు నడుచుకోవాలి. స్పీకర్ ముందస్తు అనుమతి లేకుండా సభ్యులు ఎలాంటి లిఖితపూర్వక ప్రసంగాన్ని చదవడానికి అనుమతించరు. అసెంబ్లీ లోపల అధికారుల పేర్లను తీసుకోవడానికి అనుమతించరు. కొత్త నిబంధనలు ఆగస్టు 9 వరకు చర్చకు తెరిచి ఉంటాయి. సవరణలకు ప్రతిపాదించబడతాయి.  ఈ సెషన్ చివరి రోజున అంటే ఆగస్టు 11న ఆమోదించబడే అవకాశం ఉంది.

కొత్త నిబంధనల ప్రకారం, స్పీకర్ అనుమతిస్తే తప్ప గరిష్టంగా రెండు అనుబంధ ప్రశ్నలు అనుమతించబడతాయి. కొత్త నిబంధనలు, ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మారుస్తాయని పేర్కొన్నారు. ఉదాహరణకు, అత్యవసరమైన ప్రజా ప్రాముఖ్యత గల విషయాలపై దృష్టి సారించినందుకు, ప్రభుత్వం సంబంధిత సభ్యునికి, అసెంబ్లీ సెక్రటేరియట్‌కు 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 

అలాగే, ఒక మంత్రి చిన్న నోటీసులో “షార్ట్ నోటీసు ప్రశ్నలకు” సమాధానం ఇవ్వలేని స్థితిలో లేకుంటే, అతను/ఆమె దాని గురించి అసెంబ్లీ సచివాలయానికి తెలియజేసేటప్పుడు, క్లుప్తంగా కారణాన్ని కూడా ఇవ్వవలసి ఉంటుంది. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement