UP man living on 100-feet-tall palm tree :   భర్త కొడుతున్నాడని ఫిర్యాదు చేసే భార్యలు చాలా మంది ఉంటారు. అలాగే తలుపులేసని భర్తను చితక్కొట్టి.. తాననే కొట్టాడని బయటకు వచ్చి ఏడ్చి భర్త పరువు కాపాడే భార్యలూ ఉంటారు. అదే సమయంలో  భర్తను చితక్కొట్టి.. ఇంటికి రావాలంటేనే భయడేలా చేసే భార్యామణులూ ఉంటారు. కాకాపోతే అరుదుగా ఉంటారు.ఇలాంటి ఓ భార్య తన్నులు భరించలేక ఓ భర్త పారిపోవాలనుకున్నాడు.  కానీ ఎక్కడకు పోవాలో తెలియలేదు. చివరికి చెట్టెక్కి కూర్చున్నాడు. నెల రోజుల పాటు చెట్టుపైనే ఉన్నాడు. దిగమంటే దిగలేదు. చివరికి పెద్దలంతా వచ్చి పెళ్లాం కొట్టకుండా చూస్తామని హమీ ఇస్తే కానీ ఆ భర్తకు ధైర్యం  కలగలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 


తట్టుకోలేని విధంగా కొడుతున్న భార్య 


ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన 42  ఏళ్ల రామ్‌ ప్రవేశ్‌కి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లైన కొత్తలో  ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.  ఆ తర్వాత కొన్నాళ్లకు భార్యభర్తల మధ్యా మనస్పర్థలొచ్చాయి. ఓ రోజు రామ్‌ పెట్టే బాధల్ని తట్టుకోలేక అతని భార్య ఆయనపై చేయిచేసుకుంది. ఇక ప్రతిసారీ వారిమధ్య గొడవ జరిగినప్పుడల్లా కొట్టడం నేర్చుకుంది. మొదట్లో ఓ మాదిరిగానే ఉన్న దెబ్బలు రాను రాను తీవ్రమయ్యాయి. ఇటీవలి కాలంలో చచ్చేలా కొడుతోంది. - భార్య పెట్టే బాధల్ని తట్టుకోలేక రామ్‌ ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. కనిపించకుండా వెళ్లాలనుకున్నాడు. కానీ ధైర్యం చాల్లేదు. కానీ ఆయనకు ఓ దారి కనిపించింది. అదే చెట్టు. 


భరించలేక చెట్టెక్కి కూర్చున్న రామ్ ప్రవేశ్ 


రామ్ ప్రవేశ్ ఇంటి ముందుఓ పెద్ద కొబ్బరి చెట్టు ఉంది. అది దాదాపుగా వంద అడుగుల ఎత్తు ఉంటుంది. వెంటనే దాన్ని ఎక్కేశాడు. గ్రామస్తులకు విషయం తెలిసి.. ఆయన్ని చెట్టు దిగమని ఎంత బతిమాలినా చెట్టు మాత్రం దిగడం లేదు. మరి తిండి తిప్పలు ఎలా అంటే.. భార్య నిద్రపోయాక.. కిందకు దిగి దొరికింది తిని కొన్ని రాళ్లు తీసుకుని మళ్లీ చెట్టుపైకి వెళ్లేవాడు.   రామ్‌ ఆ రాళ్లు ఏరుకోవడానికి గల కారణం.. గ్రామస్తులంతా వచ్చి అతన్ని చెట్టు దిగమంటే వారిని రాళ్లతో కొట్టడానికట. 


గ్రామస్తులు..పోలీసులు వచ్చినా సరే దిగనంటోన్న రామ్ ప్రవేశ్ 


రామ్‌ ప్రవేశ్ చెట్టెక్కి ఒకరోజు రెండురోజులు కూడా కాదు.. ఏకంగా నెలరోజుల నుంచీ ఆయన చెట్టుపైనే నివాసముంటున్నాడు. ఆ చెట్టు కూడా ఊరి నడిబొడ్డున ఉండడంతో అతనికి ఆ గ్రామంలోని ప్రతి ఇల్లు కనబడుతుంది. చివరికి గ్రామ ప్రజలందరూ కలిసి రామ్‌పై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. అయినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులే రోజూ అతనికి  అన్నం, నీళ్లు కింద పెడుతున్నారు. ఎప్పుడో ఓ సారి దిగి.. తిని పైకెళ్లిపోతున్నాడు. 


దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లా కొన్న అంబానీ, దాని విలువెంతో తెలుసా?