United Airlines flight Viral Video: జపాన్‌కి చెందిన United Airlines ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కోలో టేకాఫ్ అయిన కాసేపటికే ఊహించని ఘటన జరిగింది. ఉన్నట్టుండి టైర్ ఊడి కింద పడిపోయింది. ఆ సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులున్నారు. మొత్తం ఆరు టైర్‌లుండగా అందులో ఒకటి ఊడిపోయింది. టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఇది జరిగింది. అంతకు ముందే ఈ ప్రమాదం జరిగి ఉంటే ఎలా ఉండేదో అని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. San Francisco International Airport నుంచి టేకాఫ్ కాగానే టైర్ ఊడిపోయింది. కింద ఎంప్లాయ్ పార్కింగ్ ప్లేస్‌లోని ఓ కార్‌పై పడింది. ఫలితంగా కార్ అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ల్యాండింగ్ ఎలా అవుతుందో అని ఆందోళన చెందినప్పటికీ...ఎలాగోలా సేఫ్‌గానే కిందకి దిగింది విమానం. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరవాత ప్యాసింజర్స్‌ని వేరే ఫ్లైట్‌లోకి మార్చారు. Federal Aviation Administration ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎందుకిలా జరిగిందో విచారణ కొనసాగిస్తోంది.
ఫ్లైట్ టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఊడి కిందపడిపోయిన టైర్ - వీడియో వైరల్
Ram Manohar
Updated at:
08 Mar 2024 10:58 AM (IST)
Viral Video: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే టైర్ ఊడి కింద పడిపోయింది.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే టైర్ ఊడి కింద పడిపోయింది.