గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహా మరో ఇద్దరు అభ్యర్థులు కేసరిదేవ్ సింగ్ ఝాలా, బాబూభాయ్ దేశాయ్ ఉన్నారు. జూలై 20న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ ముగ్గురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జూలై 24న పోలింగ్ తేదీని నిర్ణయించాల్సి ఉంది. ఇక ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆ ఎన్నికలు జరగవు. 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు అధికారికంగా ఇంకా వెలువడక ముందే బీజేపీ మూడు స్థానాల్లో గెలిచింది. దీనిపై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Rajya Sabha News: రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక, వారిలో కేంద్ర మంత్రి కూడా
ABP Desam
Updated at:
17 Jul 2023 08:29 PM (IST)
గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జూలై 24న పోలింగ్ తేదీని నిర్ణయించాల్సి ఉంది. ఇక ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అక్కడ ఎన్నికలు జరగవు.
ఎస్ జయశంకర్ (ఫైల్ ఫోటో)