Uniform Civil Code : స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి పౌరస్మతి యూనిఫాం సివిల్ కోడ్ - యూసీసీని అమలు చేస్తోన్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఈ రోజు నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఇప్పుడు సన్నాహాలు పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జనవరి 26న స్పష్టం చేశారు. ఈ చట్టానికి సంబంధించిన అన్ని నిబంధనలు ఆమోదం పొందడం, సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వడంతో సహా చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని సన్నాహాలు పూర్తి చేసిందని చెప్పారు. యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందని, పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు ఉంటాయన్నారు. దీంతో అస్సాంతో సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరాఖండ్‌లోని యూసీసీని మోడల్‌గా స్వీకరించాలని ఇప్పటికే తమ కోరికను వ్యక్తం చేశాయి.
పౌరులపై యూసీసీ ప్రభావం
యూనిఫాం సివిల్ కోడ్ అమలు చాలా మార్పులను తీసుకొస్తుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్, విడాకులు, వారసత్వం సంబంధిత చట్టాలు నియంత్రణలోకి వస్తాయి. పురుషులతో పాటు స్త్రీలకూ సమానమైన వివాహ వయస్సును నిర్దేశిస్తుంది. వీటితో పాటు మరికొన్ని మార్పులు జరగనున్నాయి. వాటిలో..
- అన్ని మతాల్లో బహుభార్యత్వంపై లేదా ఒకరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండే విషయంపై నిషేధం ఉంటుంది.
- హలాల్ విధానంపైనా నిషేధం వర్తిస్తుంది,
- మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో లింగ సమానత్వం సాధించేందుకు మార్గం సుగమమవుతుంది.
- వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం వంటి అంశాల్లో లింగ సమానత్వం సాధించవచ్చు.
- సహజీవనానికి సంబంధించిన పలు నిబంధనలను యూసీసీలో పొందుపర్చారు. అలాంటి వారికి ఇకపై రిజస్ట్రేషన్ ను తప్పనిసరి చేశారు. రిలేషన్షిప్ లో ఉండే ఇద్దరూ తమ పేరు నమోదును స్థానిక రిజిస్ట్రార్‌కి సమర్పించవలసి ఉంటుంది. వారు చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉన్నట్టు ఈ నమోదు ధృవీకరిస్తుంది. దీని కోసం ప్రభుత్వంలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.
- అన్ని మతాలకు చెందిన స్ర్తీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది.
- వాయుసేన, నౌకాదళ సిబ్బంది, సైనికుల కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యంతో అత్యంత వేగంగా, సులభంగా వీలునామాను తయారు చేయించేందుకు వీలుంటుంది.
- షెడ్యూల్డ్ తెగలు, రక్షిత అధికార-సాధికార వ్యక్తులు, సంఘాలు మినహా ఉత్తరాఖండ్ నివాసితులందరికీ యూసీసీ వర్తిస్తుంది.
యూసీసీ చట్టంపై కాంగ్రెస్ అభ్యంతరం
ఉత్తరాఖండ్ లో నేటి నుంచి అమల్లోకి రానున్న యూసీసీపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. యూసీసీని ప్రయోగాత్మ పాజ్రెక్టుగా కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. ఏకాభిప్రాయం లేకుండా చట్టాన్ని అమలు చేస్తున్నారని, ఇది ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పారు.
Also Read : Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు