UGC Update: విద్యార్థులకు యూజీసీ బంపర్ ఆఫర్- ఇక ఒకేసారి 2 డిగ్రీలు!

ABP Desam   |  Murali Krishna   |  12 Apr 2022 07:12 PM (IST)

విద్యార్థులకు యూజీసీ సూపర్ ఆఫర్ ఇచ్చింది. ఒకసారి రెండు డిగ్రీలు చేసే వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

విద్యార్థులకు యూజీసీ బంపర్ ఆఫర్- ఇక ఒకేసారి 2 డిగ్రీలు!

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండు డిగ్రీల విధానానికి త్వరలోనే అనుమతి లభించనున్నట్లు ప్రకటించింది. ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ ప్రకటించారు.

కొత్తగా ప్రకటించిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీలు చేసే వీలుంది. దీనివల్ల విద్యార్థులు అనేక స్కిల్స్ పెంచుకుంటారు. ఒకే యూనివర్సిటీ నుంచి ఒకేసారి రెండు డిగ్రీలు పొందవచ్చు. లేదా వేరువేరు యూనివర్సిటీల నుంచి కూడా రెండు డిగ్రీలు చేయొచ్చు. ఫిజికల్ మోడ్‌తోపాటు ఆన్‌లైన్‌లో కూడా రెండు డిగ్రీలు చదివే వీలుంది.                                                  - జగదీష్ కుమార్, యూజీసీ ఛైర్మన్

Published at: 12 Apr 2022 07:12 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.