Election Schedule: రేపే ఎన్నికల షెడ్యూల్ - భారీ ట్విస్ట్ ఇచ్చిన ఎన్నికల సంఘం

New Election Commissioners: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Continues below advertisement

Two New Election Commissioners: ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శనివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ట్వీట్ చేసింది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

కాగా, కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లను ఇటీవల నియమించగా.. వీరు శుక్రవారం ఉదయం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈసీ వారికి అభినందనలు తెలియజేశారు. కాగా, ఇటీవల అరుణ్ గోయల్‌, అనూప్ చంద్ర పాండే రాజీనామాతో కమిషనర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది. అనంతరం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్‌, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధుని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరుగురి పేర్ల పరిశీలన అనంతరం వీరిని ఎంపిక చేయగా.. వెను వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి నియామకానికి ఆమోద ముద్ర వేశారు.

Also Read: Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు బహిర్గతం చేసిన ఈసీ - ఏ పార్టీకి ఎంత ఆదాయమో ఇక్కడ తెలుసుకోండి

Continues below advertisement