Jammu Kashmir Encounter: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా కమాండర్ యాసిర్ జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు శుక్రవారం మట్టుబెట్టాయి. కొంతకాలంగా ఉగ్రవాది యాసిర్ కదలికలపై నిఘా పెట్టిన భద్రతా బలగాలు యూస్‌మార్గ్ లో అతడిని గుర్తించి కాల్పులు జరిపాయి. ఇరువర్గాల కాల్పుల్లో యాసిర్ హతమైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ అష్దర్' కొనసాగుతోంది. లష్కరే తయ్యిబాకు చెందిన యాసిర్ అనే పాకిస్తానీ ఉగ్రవాది హతమయ్యాడు. యూస్‌మార్గ్‌లోని పర్వత ప్రాంతాల్లో గాలింపులో భద్రతా బలగాలపై ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపగా.. ఉగ్రవాది హతమయ్యాడు. మరణించిన ఉగ్రవాదిని యాసిర్‌గా గుర్తించినట్లు శనివారం కశ్మీర్ పోలీసులు తెలిపారు. యాసిర్ గతంలో లష్కరే తయ్యిబాకు చెందిన ఓ ఉగ్రముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. ఏడాది క్రితం ఆ బృందం నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు లష్కరే ఉగ్రవాదులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఉగ్రవాదుల ఫొటోలో యాసిర్ ఫొటో కూడా ఉంది. దీంతో గత కొంత కాలంగా యాసిర్ కదలికలపై భద్రతా బలగాలు నిఘా పెట్టారు. Also Read: ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు.. ఏఏ పార్టీల ఎంపీలు ఉన్నారంటే?
2024 వరుస దాడులు
2024లో పూంఛ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి, అదే సంవత్సరం అక్టోబర్‌లో సోనామార్గ్ సమీపంలో కార్మికులపై దాడి, బోటా పత్రిలో ఆర్మీపై దాడి ఘటనల్లో యాసిర్ ప్రమేయం ఉందని భద్రతా బలగాలు గుర్తించాయి. పూంఛ్ నుంచి యూస్‌మార్గ్ మీదుగా పుల్వామాలోని పఖేర్‌పోరా వైపు ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఉగ్రవాదుల కోసం వారం రోజులుగా నిఘా పెట్టిన ఆర్మీ... గాలింపు చేపట్టింది. యాసిర్‌తో పాటు మరికొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. Also Read: ఫ్యామిలీతో ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్లో ఇండియాలో వెళ్లేందుకు బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే
జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. యాసిర్ ఎన్‌కౌంటర్ అనంతరం, భద్రతా దళాలు అతని సహచరులపై కూడా దర్యాప్తు చేస్తున్నాయి. యాసిర్ ఏవైనా ప్రధాన కార్యకలాపాలు లేదా కుట్రలలో పాలుపంచుకున్నాడా? అనే విషయంపై విచారణ జరుపుతున్నారు. Also Read: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
