Plan Crashed in MP & Rajasthan: ఒకే సమయంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా సమీపంలో కూలిపోయాయి. ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదం జరిగిన టైంలోనే రాజస్థాన్ లోని భరత్ పూర్ నగరంలో చార్టర్డ్ విమానం కూలిపోయినట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అడ్మినిస్ట్రేషన్ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.






ఇద్దరు పైలట్లు సురక్షితం, మూడో పైలట్‌ కోసం రెస్క్యూ


ప్రమాద సమయంలో సుఖోయ్-300 విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి. మిరాజ్ 2000 విమానంలో ఒక పైలట్ ఉన్నారు. రెండు యుద్ధ విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగరడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (ఐఏఎఫ్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ) విచారణ ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారని, మూడో పైలట్ ఉన్న ప్రదేశానికి ఐఏఎఫ్ హెలికాప్టర్ త్వరలో గుర్తిస్తుందని తెలిపారు.