స్టూడెంట్స్‌ నిత్యం సిటీబస్సుల్లో వేలాడుతూ చేస్తున్న ప్రయాణాలు చాలా మంది చూస్తూనే ఉంటారు. బస్సులోపల ఖాళీగా ఉన్నా సరే కొందరు ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ఇది ఎంత ప్రమాదంలో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.  


హైదరాబాద్‌ సిటీ బస్సులో వేలాడుతూ ప్రయాణం చేస్తున్న స్టూడెంస్ట్స్‌ కనిపిస్తున్నట్టే... ముంబైలో లోకల్‌ ట్రైన్‌లో ఇలా కిక్కిరిసి వేలాడుతూ ప్రయాణిస్తుంటారు. ఇలా వేలాడుతూ ప్రయాణిస్తున్న ఓ కుర్రాడు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  


విషయం ఏంటంటే?


కల్వా, థానే స్టేషన్ మధ్య తిరిగే లోకల్ రైలు నుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున థానే జిల్లాలో సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టిన రైలు నుంచి కుర్రాడు వేలాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్‌పి) అధికారి తెలిపారు.


సంఘటన ఎలా, ఎప్పుడు జరిగింది?






కాల్వలోని భాస్కర్‌ నగర్‌లో నివాసం ఉంటున్న డానిష్‌ హుస్సేన్‌ఖాన్‌ అనే కార్మికుడు బ్యాలెన్స్‌ తప్పి రైలు పట్టాలపై పడిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అతను సబర్బన్ రైలు మోటారు కోచ్ (కంపార్ట్‌మెంట్ల మధ్య జతచేసి ఉంచిన కోచ్‌) ఇరుకైన, మూసివున్న తలుపు నుంచి మరో ముగ్గురు ప్రయాణికులతోపాటు వేలాడుతూ ప్రయాణించారు.


వీడియో సోషల్ మీడియాలో వైరల్ 


ఈ ఘటనకు సంబంధించిన వీడియోను  వేరే ట్రైన్‌లో వెళ్తున్న కొందరు ప్రయాణికులు రికార్డు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఖాన్ ట్రాక్స్ నుంచి పడిపోవడం, స్తంభాన్ని ఢీకొట్టడం చూడవచ్చు. ప్రమాదం జరిగిన 20 నిమిషాల వ్యవధిలో, బాధితుడిని ఆటో రిక్షాలో కాల్వా వద్ద సమీపంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రికి తరలించినట్లు GRP తెలిపింది. అతడికి కాలు, చేతికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.


భద్రతా చిట్కాలు


ట్రాక్‌లపై నిఘా ఉంచండి,
ట్రాక్‌లను దాటడానికి ముందు రైల్వే శాఖ చేసే ప్రకటన వినండి.
ఏ సమయంలోనైనా, ఏ వైపు నుంచి అయినా రైలు రావచ్చు చూస్తూ ట్రాక్ దాటండి. 
పరధ్యానంలో ఉంటూ... సెల్‌ఫోన్‌ చూస్తూ రైల్‌ ట్రాక్కస్ దాటొద్దు. 
రైలు స్టేషన్లలో ఎల్లప్పుడూ పసుపు గీతల వెనుక ఉండండి.
ట్రాక్‌లకు దూరంగా ఉండండి