Suman Sakhi Chatbot : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో మహిళలకు గర్భధారణ, ప్రసవం, మహమ్మారి వంటి ఆరోగ్య సంబంధిత సమస్యల కోసం ఒక పెద్ద డిజిటల్ అడుగు వేస్తూ సుమన్ సఖి చాట్‌బాట్‌ను ప్రారంభించారు. AI సాంకేతికత ఆధారంగా, ఈ చాట్‌బాట్ గర్భధారణ నుంచి పీరియడ్స్ వరకు అన్ని ఆరోగ్య సమస్యల గురించి సమాచారాన్ని అందిస్తుంది.    

Continues below advertisement

సుమన్ సఖి చాట్‌బాట్‌ను మహిళల డిజిటల్ దీది అని కూడా పిలుస్తున్నారు. అయితే ఈ చాట్‌బాట్ హిందీ భాషలో మాత్రమే సమాధానాలు ఇస్తోంది. 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని మహిళలకు సకాలంలో సమాచారం అందించడంలో ఇది సహాయపడుతుంది. ఈ చాట్‌బాట్ ద్వారా మహిళలు 9770905942 నంబర్‌కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు.     

 

Continues below advertisement

నంబర్‌కు మహిళలు హాయ్ అని లేదా క్వశ్చన్ అడుగుతూ మెసేజ్ చేయాల్సి ఉంటుంది. చాట్‌బాట్ మెనూ అందుబాటులోకి వస్తుంది. ఇందులో గర్భధారణ పరీక్ష, ప్రమాద సంకేతాలు, నవజాత శిశువు సంరక్షణ, పీరియడ్స్ సంబంధిత సమస్యల, సమీప ఆరోగ్య కేంద్రం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. 

సుమన్ సఖి చాట్‌బాట్ ఎందుకు ప్రత్యేకమైనది?

సుమన్ సఖి చాట్‌బాట్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర స్థాయి AI చాట్‌బాట్, ఇది మహిళల ఆరోగ్యం,  పోషకాహారంపై దృష్టి పెడుతుంది. దీని ద్వారా మహిళలు ప్రభుత్వ పథకాలు, కుటుంబ నియంత్రణ,  టీకాలు వంటి సేవల గురించి కూడా తక్షణమే సమాచారం పొందవచ్చు. అదే సమయంలో, ఈ చాట్‌బాట్ ప్రత్యేకత ఏమిటంటే, మీ వివరాలను ఇది పూర్తి రహస్యంగా ఉంచుంది. దీనివల్ల మహిళలు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను పంచుకోగలుగుతారు.

NHM- MPSeDC ప్రయత్నం

సుమన్ సఖి చాట్‌బాట్‌ను నేషనల్ హెల్త్ మిషన్,  మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రారంభంలో, ఇది కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో అమలు చేస్తున్నారు. తరువాత క్రమంగా మొత్తం రాష్ట్రంలో అమలు చేయనున్నారు. ఈ చాట్‌బాట్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ చాట్‌బాట్ మాతృ శిశు మరణాల రేటును తగ్గించడంలో, ఆరోగ్య సేవల లభ్యతను పెంచడంలో సహాయపడుతుందని అన్నారు. అదే సమయంలో, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కింద దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా మహిళల ఖాతాలో ఒకే క్లిక్‌తో డబ్బును బదిలీ చేశారు. సికిల్ సెల్ ఎనీమియా కార్డులను కూడా పంపిణీ చేశారు.