Subhanshu Shukla Axiom-4: భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్షంలో చారిత్రాత్మక యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా లక్నోలోని ఆయన ఇల్లు, పాఠశాల, ఆయన నివాస ప్రాంతం సంతోషంతో ఆల్‌ ద బెస్ట్ చెప్పాయి.  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత్‌కు కీర్తిని తీసుకురావడమే కాకుండా, తన కుటుంబం, ఉపాధ్యాయులు, పాఠశాలకు పేరు తెచ్చారు. నేటి తరం పిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆక్సియం-4 మిషన్ అనేది కేవలం శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగ యాత్ర కూడా.

ఎమోషన్ అయిన కుటుంబ సభ్యులు శుభాన్షు శుక్లా కుటుంబంలో ఆనందంతో ఎమోషన్ అయ్యారు. తన భావాలను పంచుకుంటూ ఆయన తల్లి ఆశా శుక్లా భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ, “మేము మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేము… శుభాన్షు గురించి మాకు భయం లేదు… మేము చాలా సంతోషంగా ఉన్నాము, చాలా గర్వంగా ఉంది.” శుభాన్షు శుక్లా బయలుదేరడంతో ఆయన తల్లి ఆశా శుక్లా ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు.

ఈ చారిత్రాత్మక క్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి శుభాన్షు తల్లిదండ్రులు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి లైవ్ చూశారు. ఈ సందర్భంగా వారిని స్వాగతించడానికి పాఠశాల యాజమాన్యం ఒక సాంప్రదాయ బృందం, ప్రత్యేక అలంకరణలను ఏర్పాటు చేసింది.

అదే సమయంలో, శుభాన్షు తండ్రి శంభు దయాల్ శుక్లా మాట్లాడుతూ, “ఈ విజయం లక్నోకే కాదు, దేశం మొత్తానికి గర్వకారణం. మిషన్ ప్రారంభం చాలా ప్రత్యేకమైనది. మా ఆశీర్వాదం ఎల్లప్పుడూ అతనితో ఉంటుంది.”

భార్య కోసం భావోద్వేగ సందేశంఅంతరిక్షంలో అడుగుపెట్టడానికి ముందు, శుభాన్షు శుక్లా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ పోస్టు పెట్టారు. తన  భార్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “జూన్ 25 ఉదయం భూమిని విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు, ఈ మిషన్‌తో సంబంధం ఉన్న వారందరికీ, ఎల్లప్పుడూ మద్దతునిచ్చిన, ప్రేమించిన నా దేశ ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా కామనకు - నీవు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.”  ఒక ఫోటోను కూడా షేర్ చేశారు, దీనిలో ఆయన, భార్య  నిలబడి వీడ్కోలు క్షణాలను పంచుకుంటున్నారు.

'మినీ మిషన్ కంట్రోల్ సెంటర్'గా మారిన పాఠశాల  లక్నోలోని శుభాన్షు పాఠశాల ఈ చారిత్రాత్మక క్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో పాఠశాలలో ‘మినీ మిషన్ కంట్రోల్ సెంటర్’ని ఏర్పాటు చేశారు, ఇక్కడ పిల్లలకు అంతరిక్ష నియంత్రణ కేంద్రం వంటి అనుభూతి పొందారు. 

భారతదేశ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయంశుభాన్షు శుక్లా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకోనున్న భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామిగా నిలిచారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత ఇది భారతదేశం రెండో మానవ అంతరిక్ష యాత్ర. మొదటిసారిగా ఒక భారతీయుడు ఆక్సియం మిషన్ ద్వారా ప్రైవేట్ భాగస్వామ్యం కింద ISSకి వెళ్తున్నారు.