Fact Check: విద్యార్థులకు సంబంధించిన ఒక మెసేజ్‌ బాగా వైర్ అవుతోంది. సోషల్ మీడియా  వాట్సాప్‌లో బాగా షేర్ అవుతోంది. విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లను అందిస్తోందని, ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయని ఆ మెసేజ్‌ సారాంశం. దరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయాల్సిన ఒక లింక్ కూడా ఆ మెసేజ్‌లో ఇచ్చారు.  

Continues below advertisement

ఈ సందేశంలో ప్రధానమంత్రి ఫోటోతోపాటు విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం జి20 లోగోలను ఉపయోగించారు. చాలామంది ఇది నిజమైన ప్రభుత్వ పథకంగా భావిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్‌ సంస్థ అయిన పిఐబి దీన్ని ఖండించింది. 

ఉచిత ల్యాప్‌టాప్ గురించి వైరల్ అవుతున్న మెసేజ్ ఏంటీ?

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తోందని వైరల్ అవుతున్న మెసేజ్‌లో ఉంది. అందులో ఒక లింక్‌ కూడా ఉంది. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలనుకునే వారంతా లింక్‌పై క్లిక్ చేయాలని కూడా సూచిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తారని కూడా ఆ సందేశంలో పేర్కొన్నారు. ఆ సందేశం అచ్చం ప్రభుత్వం విడుదల చేసిన సందేశంగా మార్చేందుకు దానిలో ప్రధానమంత్రి ఫోటోతో పాటు విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, జి20 లోగోలను కూడా పొందుపరిచారు. స్క్రీన్‌పై "ప్రభుత్వం నుండి ఉచిత ల్యాప్‌టాప్ పొందండి" మరియు "ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి" అనే పదాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే, మొదటి చూపులో ఈ సందేశం ప్రభుత్వ పథకానికి సంబంధించినదిగా అనిపించవచ్చు. 

Continues below advertisement

పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పింది?

వైరల్ అవుతున్న ఈ వాదనపై విచారణ జరిపిన తర్వాత, పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఇది పూర్తిగా అబద్ధమని ప్రకటించింది. పిఐబి ప్రకారం, విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించేందుకు భారత ప్రభుత్వం గానీ, విద్యా మంత్రిత్వ శాఖ గానీ ఎలాంటి పథకాన్ని తీసుకురాలేదని స్పష్టం చేసింది. అంటే, వైరల్ మెసేజ్‌లో చెప్పిందంతా అబద్ధం. ఈ మెసేజ్‌కు భారత ప్రభుత్వంతో గానీ, విద్యా మంత్రిత్వ శాఖతో గానీ ఎలాంటి సంబంధం లేదని కూడా పిఐబి తేల్చి చెప్పింది. ఈ మెసేజ్‌లో ఉపయోగించిన లోగో, ఫార్మాట్, లింక్ కూడా నకిలీవే. 

నకిలీ లింక్‌లపై క్లిక్ చేయవద్దు

ఇలాంటి అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రజలకు సలహా ఇస్తోంది. వైరల్ మెసేజ్‌ల లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతాయి, కానీ అలాంటి లింకులు నకిలీ వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లకు దారితీయవచ్చు, అక్కడ ప్రజలను వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు చోరీకి గురి అయ్యే ప్రమాదం ఉంది.  అందువల్ల, అలాంటి  మెసేజ్‌లను వెంటనే నమ్మే ముందు లేదా లింక్‌పై క్లిక్ చేసే ముందు, అందులోని సమాచారాన్ని సరిచూసుకోవడం ముఖ్యం. 

విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026 కింద ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాదనను ప్రభుత్వం కూడా ఖండించింది. వైరల్ అవుతున్న ఆ సందేశంలో, లబ్ధిదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవాలని కోరారు. ప్రభుత్వం అటువంటి పథకాన్ని ఏదీ ప్రకటించలేదని పేర్కొంటూ, ఈ వాదన నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రకటించింది. ఇటువంటి ప్రకటనలతో మోసపోవద్దని, ఏదైనా ప్రభుత్వ పథకం లేదా వార్తను అధికారిక ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రమే ధృవీకరించుకోవాలని ఆ సంస్థ ప్రజలను కోరింది.